హైదరాబాద్: అశ్లీల నృత్యాలను ప్రదర్శిస్తూ యువతను పెడదారి పట్టించేలా అనైతిక చర్యలకు పాల్పడుతున్న బేగంపేటలోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బేగంపేటలోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్‌లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు.
ఆ సమయంలో బార్‌లో పెద్ద సంఖ్యలో యువతులు అశ్లీల నృత్యాలు చేస్తుండగా యువకులు వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో నిర్వాహకులు, మేనేజర్లతో సహా మొత్తం 108 మందిని అరెస్టు చేశారు. వీరిలో 33 మంది యువకులు కాగా, మరో 75 మంది యువతులు ఉన్నారు. వీరిని బేగంపేట ఉమెన్ పోలీస్‌స్టేషన్, బొల్లారం పోలీస్‌స్టేషన్లకు తరలించారు. రెండు నెలలుగా బార్‌లో అశ్లీల నృత్యాలు, డీజే శబ్దాల హోరు కొనసాగుతున్నట్లుగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను బేగంపేట పోలీసులకు అప్పగించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025