మ్యాట్రిమోనిలో పెళ్లి సంబంధాలు చూసుకునే యువతీయువకులకు సజ్జనార్ కీలక సూచన చేశారు. అందమైన ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి కేటుగాళ్లు డబ్బులు గుంజుతున్నారంటూ ఓ వీడియోను షేర్ చేశారు. న్యూడ్ వీడియో కాల్స్ వస్తే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.
Matrimony: ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చిన ఆన్లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ రూపాల్లో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తూ అడ్డగోలుగా దోచేస్తున్న దుండగులు తాజాగా వివాహ వేదికలపై కన్నేశారు. పెళ్లి సంబంధాల పేరిట యువతీయువకులను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కాదంటే న్యూడ్ వీడియోలు పంపించి బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన మ్యాట్రిమోనిలో వెలుగులోకి రాగా.. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
న్యూడ్ వీడియో కాల్స్..
ఈ మేరకు మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నట్లు ఓ అమ్మాయి వివరించిన వీడియోను షేర్ చేశారు సజ్జనార్. పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారు. అడిగినంతా డబ్బు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
మ్యాట్రిమోని సైట్ల కేంద్రంగా ఈమధ్య పెరిగిపోతున్న మోసాలను గమనించాలి. న్యూడ్ వీడియోల వ్యవహారం బయటకి వస్తే పరువు పోతుందనే భయంతో ఫిర్యాదుకు జంకుతున్న బాధితులు.. ఆత్మ హత్యలకు సైతం పాల్పడుతున్నారు. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో పరిచయమైన యువతి, యువకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వీడియో కాల్స్ చేయమన్నా, న్యూడ్ ఫోటోలు అడిగిన కచ్చితంగా అనుమానించాల్సిందే. మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 నబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండని సూచించారు.
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





