కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్ కు వెళ్తే అక్కడో కానిస్టేబుల్ బాధితురాలని నమ్మించి తిరిగి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కానిస్టేబుల్ తో పాటుగా మరోకరిని అరెస్ట్ చేశారు.
కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే అక్కడో కానిస్టేబుల్ బాధితురాలని నమ్మించి తిరిగి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బొమ్మనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని కానిస్టేబుల్ తో పాటుగా మరోకరిని అరెస్ట్ చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం17 ఏళ్ల మైనర్ బాధితురాలు బొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. ఆమెకు తన ఇంటి పొరుగున ఉన్న వివాహితుడైన విక్కీతో పరిచయం ఏర్పడింది. విక్కీ మైనర్‌ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత ముఖం చాటేశాడు. బాధితురాలు తన తల్లికి జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి బొమ్మనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విచారణ క్రమంలో కానిస్టేబుల్ అరుణ్ బాధితురాలితో స్నేహం పెంచుకున్నాడు. ఆమెకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు అంతేకాకుండా తనకు తెలిసిన వాళ్ల దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఆమెను బెంగళూరులోని ఒక హోటల్‌కు పిలిపించి కూల్ డ్రింక్ లో డ్రగ్స్ కలిపాడు. మత్తులోకి జారుకున్నాక ఆమెపై అత్యాచారం చేశాడు.
చెబితే చంపేస్తా
ఆ తరువాత ఎవరికైనా ఈ విషయాన్ని చెబితే చంపేస్తానని, అంతేకాకుండా ఆమె ప్రైవేట్ వీడియోలు తన వద్ద ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తానని హెచ్చరించారు. జరిగిన విషయాన్ని బాధితురాలు తన తల్లికి చెప్పడంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కానిస్టేబుల్ అరుణ్ తో పాటుగా విక్కీని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపైనా పోక్సో చట్టం 2012 (U-4.6.10.12.15), భారతీయ న్యాయ సంహిత (BNS), 2023 (U/s-64(1),64(2)(a).351(3)) కింద కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు
Also Read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025