పుత్తూరు: బాబు, విజయ దంపతులకు కలిగిన క్షోభ మరెవరికీ రాకూడదని మంత్రి ఆర్కే రోజా భావోధ్వేగం చెందారు. శుక్రవారం వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం గ్రామానికి వెళ్లి ముగ్గురు ఆడ బిడ్డలను పోగొట్టుకొన్న తల్లిదండ్రులను మంత్రి ఓదార్చారు. వారి బాధను చూడలేక ఆమె కూడా కంటతడి పెట్టారు. శివుడికి పూజలు చేసి, దీపారాధన చేస్తూ చెరువులో పడి మృత్యువాత పడ్డ చిన్నారులు రూపిక, చరిత, యుషిక మృత దేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇలాంటి పరిస్థితుల్లో గుండె రాయి చేసుకోవాలని, తాను అండగా ఉంటానని బాధిత కుటుంభానికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కోరారు. బాసటగా నిలవాలని గ్రామస్తులను కోరారు. అనంతరం అశ్రునయనాల మధ్య చిన్నారుల మృత దేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025