July 1, 2024
SGSTV NEWS
CrimeTrending

రూ.200 కోట్ల స్కాం కేసులో కీలక పరిణామం..వాణి బాల అరెస్ట్!



200 Crore Scam Case: నిమ్మగడ్డ వాణిబాల అనే దంపతులు రూ.200 కోట్ల  కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

సామాన్య ప్రజలకు డిపాజిట్ల పేరుతో ఓ దంపతులు రూ.200 కోట్ల  కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. కొన్ని రోజుల క్రితమే ఈ దంపతలు స్కామ్ వ్యవహారం బయటపడింది. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిన సమయంలోనే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ (టీఎస్ సీఏబీ ) నిమ్మగడ్డ వాణి బాలని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.  అంతేకాక ఆమె భర్త మెకా నేతాజీ పాటు అతని కుమారుడు శ్రీహర్షను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మగడ్డ వాణీ బాల, మేక నేతాజీ దంపతులు. వీరు హైదరాబాద్ లోని సైదాబాద్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. వాణీ బాల  హైదరాబాద్ అబిడ్స్ లోని  తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె భర్త నేతాజీ, కొడుకు శ్రీ హర్షలు ..శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజేస్ పేరుతో చిట్ ఫండ్ కంపెనీని ప్రారంభించారు. ఈ క్రమంలోనే వాణి బాల..తన బ్యాంకులో డిపాజిట్లు చేసేందుకు వచ్చే వినియోగదారులకు మాటలు కలిపి…వారిని తమ సంస్థలో చీటీలు కట్టేలా వారిని మార్చేది. ఈ క్రమంలోనే తాను పని చేసే బ్యాంకుకు సమీపంలో తమ వాళ్లది మరో ఆఫీసును కూడా తెరిపించింది ఆ విధంగా 517 మంది నుండి రూ. 200 కోట్లు కాజేశారు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లోఆమె రిటైర్డ్ అవుతుండగా.. సడెన్ గా సెలవులు పెట్టింది. ఇదే సమయంలో దంపతుల ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో బోర్డు తిప్పేశారని అర్థం చేసుకున్న కస్టమర్లు లబోదిబోమంటున్నారు.

తమకు న్యాయం చేయాలంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఈ స్కామ్ బయటకు రావడంతో వాణీ బాలను విధుల్లో నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు వాణి బాల చిట్ ఫండ్ కంపెనీ శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ పైన సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. 200 కోట్ల స్కామ్ జరిగినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ క్రమంలో తాజాగా ప్రధాన నిందితురాలు నిమ్మగడ్డ వాణిబాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె తోపాటు పాటు ఆమె భర్త నేతాజీ, కొడుకును హర్షలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా చిట్ ఫండ్స్ పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నా.. అనేక మంది మోసపోతున్నారు. మరి.. ఇలాంటి మోసాలకు పాల్పడే వారికి ఎలాంటి శిక్ష విధించాలి?  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి

Also read

Related posts

Share via