తమిళనాడులోని వేలూరులో జరిగిన హత్యకేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడేళ్ల కూతురు ఇచ్చిన సమాచారంతో తండ్రి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేయించినట్లు గుర్తించారు. రెండు రోజుల క్రితం భరత్ అనే వ్యక్తి దారుణ హత్యకు…
తమిళనాడులోని వేలూరులో జరిగిన హత్యకేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడేళ్ల కూతురు ఇచ్చిన సమాచారంతో తండ్రి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేయించినట్లు గుర్తించారు. రెండు రోజుల క్రితం భరత్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భార్య, పిల్లలతో బైక్‌పై వెళ్తుండగా కత్తులతో దాడి చేసి చంపేశారు. అయితే పోలీసుల విచారణలో అసలు గుట్టు రట్టయింది. భర్తను భార్య నందిని హత్య చేయించినట్టు నిర్ధారణ అయింది. భార్య నందినిని, ప్రియుడు సంజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వేలూరు జిల్లా ఒడుకత్తూర్ వద్ద కుప్పంపాళ్యానికి చెందిన భారత్(36) వృత్తిరీత్యా వంట మాస్టర్. చెన్నైలోని ఓ హోటల్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల నందినితో వివాహమైంది. వారికి నాలుగు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారాంతపు సెలవు రోజుల్లో భార్యాపిల్లలను చూసేందుకు భారత్ సొంతూరుకు వస్తుంటాడు. ఈ నెల 21న ఇంటికొచ్చాడు. సరుకుల కోసం భార్య, చిన్న కుమార్తెను తీసుకుని బైక్‌పై షాపుకు వెళ్లి సరుకులు కొనుగోలు చేశాడు. ఇంటికి తిరిగి వస్తునన సమయంలో రోడ్డుపై అడ్డంగా కొబ్బరిమట్టలు కనిపించాయి. వాటిని దాటే యత్నంలో అదుపుతప్పి కిందపడిపోయాడు.
అయితే అక్కడే మాటువేసిన ఓ వ్యక్తి కత్తితో భారత్‌పై తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. బాధితుడు ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. విచారణలో నందిని పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం కలిగింది. భారత్ చిన్న కుమార్తెను ఆరా తీయగా.. సంజయ్ మామ తన తండ్రిపై దాడి చేసినట్లు పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పింది. దాంతో భార్య నందినిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వ్యవహారమంతా బయటపడింది.
ఎదురింట్లో ఉండే 21 ఏళ్ల సంజయ్‌తో నందిని వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి భారత్ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. దీంతో భారత్‌ను హతమార్చేందుకు ఇద్దరూ పథకం వేసినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. నిందితులిద్దరినీ పోలీసులు కోర్టులో హాజరుపర్చి, జైలుకు తరలించారు
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





