SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: తెల్లారి ఆలయానికి వచ్చిన అర్చకులు.. గుడిలో కనిపించింది చూడగా..



అతి పురాతన ప్రాచీన చారిత్రాత్మక శివాలయంపై దోపిడి దొంగలు తెగబడ్డారు. ఇంతవరకు చిన్న ఆలయాలను టార్గెట్ చేసిన దోపిడి దొంగలు పెద్ద ఆలయంపై ఎటాక్ చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ఐదు ప్రధాన శైవక్షేత్రాల్లో ముఖ్యమైన కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలోకి అర్ధరాత్రి ఇద్దరు యువకులు ముసుగు ధరించి చొరబడ్డారు. బండరాళ్లు, ఇనుప రాడ్లతో గేట్లను బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు.


ఉమ్మడి కర్నూలు జిల్లా శైవక్షేత్రాలలో శ్రీశైలం మహానంది యాగంటి ఓంకారం తర్వాత అత్యంత కీలకమైన ఆలయం కాల్వబుగ్గ రామేశ్వర స్వామి గుడి. కొన్ని దశాబ్దాల క్రితమే ఆలయం వెలసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని రామేశ్వర స్వామి దేవస్థానంలో 5 హుండీలను దుండగులు చోరీ చేశారు. ఆలయానికి మొత్తం ఎనిమిది హుండీలు.. అందులో ఐదు చిన్నవి. మూడు పెద్ద హుండీలను వదిలేసి దొంగలు చిన్న హుండీలను టార్గెట్ చేశారు. పెద్ద హుండీలను ఎత్తుకెళ్లలేకనో, లేకవాటిని దోచుకునేందుకు చేతకాకనో తెలియదు కానీ పెద్దవాటిని వదిలేసి ఐదు చిన్న హుండీలను ఎత్తుకెళ్లారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామున స్వామి వారి కంకర్యాల కోసం గేటు తెరవడానికి ప్రయత్నించగా.. అప్పటికే గేట్ తెరిచి ఉండడం గమనించి ఆలయ ఈవోకి సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఆలయ సిబ్బంది ఆలయంలోకి వెళ్లి చూడగా హుండీలు కనపడకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆలయంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఆలయ మెయిన్ గేటు తాళాలు పగలగొట్టి ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్క్ వేసుకుని హుండీలను అపహరించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు పక్కన కాలువలో హుండీలను పగలకొట్టి అందులో చిల్లర నాణేలను వదిలేసి నగదు, నోట్ల కరెన్సీని దుండగులు దోచుకెళ్లారు. మహాశివరాత్రి తర్వాత హుండీలో లెక్కింపు జరిగింది. గత ఐదు నెలల్లో భక్తులు హుండీలో సుమారు రెండు లక్షల రూపాయల నగదు వేసి ఉంటారని స్థానికులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయినా దృశ్యాలను పరిశీలించిన ఓర్వకల్లు ఎస్ఐ సునీల్ కుమార్ దుండగుల వయస్సు సుమారు 20 సంవత్సరాలు వరకు ఉంటుందని తెలిపారు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్లు ఓర్వకల్లు ఎస్సై తెలిపారు.

Also read

Related posts

Share this