April 11, 2025
SGSTV NEWS
Crime

ఇష్టం లేని పెళ్లి చేశారని నవ వధువు ఆత్మహత్య

ఇష్టం లేని వివాహం చేశారని నవ నదువు ఆత్మహత్యకు పాల్పడింది పీట్బషీరాబాద్ సీఐ కె.విజయవర్ధన్ కథనం. ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా పెరవళి మండలం ముక్కామల గ్రామానికి చెందిన శ్రీనివాస్…

హైదరాబాద్, ఇష్టం లేని వివాహం చేశారని ఓ నవ పదువు అత్మహత్యకు పాల్పడింది. పేట్ భాషీరాబాద్ సీ ఐ కె. విజయవర్దన్ కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన శ్రీనివాస్, రామలక్ష్మిల కూతురు అరిపిరాల దుర్గా శ్రీదేవి(25) కి తాడేపల్లిగూడెం సమీపంలోని వెల్లమిల్లికి చెందిన వంశీకృష్ణ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అక్టోబరు 16న వివాహమైంది. వీరు నగరంలోని సుచిత్ర కూడలి సమీపంలోని’ ఎం.ఎన్. రెడ్డినగర్ వీకే రెసిడెన్సీలో ఉంటున్నారు. ఈ వివాహం శ్రీదేవికి ఇష్టం లేకపోవడంతో… దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. శుక్రవారం సాయంత్రం భార్యాభర్తలు ఇరువురు మేడపైకి వెళ్లారు. వీరి ఇద్దరి మధ్యన మాటామాటా పెరిగి భర్త చూస్తుండగానే దుర్గా శ్రీదేవి వారుంటున్న అపార్టుమెంటు ఐదో అంతస్తు నుంచి కిందికి దూకింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులు వెంటనే ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్త చేస్తున్నారు.

Also read

Related posts

Share via