June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్.. వైకాపాకు రాజీనామా చేశారు.





నెల్లూరు (నగరపాలక సంస్థ), : నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్.. వైకాపాకు రాజీనామా చేశారు. కార్పొరేషన్ ఛాంబర్లో సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ‘నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి 14 నెలల క్రితం అధికార వైకాపాను వీడినప్పుడు మేమూ ఆయన వెంటే నడిచాం. మేయర్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడినా వైకాపా నేత ఆదాల ప్రభాకర్రెడ్డి బెదిరింపులు, ఒత్తిళ్లతో వెనక్కు తగ్గాం. వైకాపాలో ఉన్నా మాకు రాజకీయ భిక్షపెట్టిన శ్రీధర్రెడ్డిని పల్లెత్తుమాట అనలేదు. కుటుంబ పెద్దగా ఆయన మమ్మల్ని క్షమించి అక్కున చేర్చుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు.

Also read

Related posts

Share via