SGSTV NEWS online
Andhra PradeshCrime

Nellore: ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై కత్తితో దాడి.. బంగారు ఆభరణాలు చోరీ


గూడూరు గ్రామీణం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేసి బంగారు ఆభరణాలు అపహరించాడు. గూడూరు రూరల్ మండలం కందలి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిత (35) బాలాయపల్లి మండలం గొట్టిగాడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. గూడూరు నుంచి పాఠశాలకు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఈ క్రమంలో నిర్మానుష్య ప్రదేశంలో డ్రైవర్ ఆటో ఆపి హరితపై కత్తితో దాడి చేశాడు. అనంతరం ఆమె బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. గాయపడిన ఉపాధ్యాయురాలిని గూడూరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ ఘటనపై గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts