చంద్రగిరి (తిరుపతి) : స్కూల్లో ఓ విద్యార్ధి కిందపడి చేయి విరిగినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదంటూ …. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించిన ఘటన శుక్రవారం తిరుపతిలో జరిగింది. చంద్రగిరి చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్న ఓ బాలుడు మహానాయక్ కిందపడటంతో చేయి విరిగింది. ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలిపారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల నుంచి ఫీజులు మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తారని, పిల్లల్ని మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ను బాధితులు ఆశ్రయించారు. బాధితులపై స్కూల్ టీచర్లు తిరగబడ్డారు. చైతన్య టెక్నో స్కూల్లో అర్హతలేని టీచర్లు, ప్రభుత్వ నిబంధనలు పాటించంకపోవడంపై రాష్ట్ర విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..





