July 1, 2024
SGSTV NEWS
CrimeNational

వైద్యుల నిర్లక్ష్యం : ఆసుపత్రి గేటు వద్దే ప్రసవం, చివరికి!




జైపూర్:  నవమాసాలు నిండిన నిండు గర్భిణిని కుటుబ సభ్యులు కాన్పు కోసం ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యులు పట్టించుకోలేదు. అడ్మిషన్‌కు నిరాకరించారు.  దీంతో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆమె ఆసుపత్రి గేటువద్దే  బిడ్డను ప్రసవించిన ఘటన ఆందోళన రేపింది. రాజస్థాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

గర్భిణీ స్త్రీకి అడ్మిషన్ నిరాకరించి,నిర్లక్ష్యంగా వ్యవహరించి వైద్యులపై రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు  చేపట్టింది.  ముగ్గురు రెసిడెంట్ వైద్యులను సస్పెండ్ చేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన  వైద్యులు కుసుమ్ సైనీ, నేహా రాజావత్, మనోజ్‌ను సస్పెండ్ చేశామని వైద్య విద్య అదనపు ముఖ్య కార్యదర్శి శుభ్రా సింగ్ వెల్లడించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే, తక్షణమే విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. సరిగ్గా పర్యవేక్షించని కారణంగా కన్వాటియా హాస్పిటల్ సూపరింటెండెంట్  డా. రాజేంద్ర సింగ్ తన్వర్‌కు షోకాజ్ నోటీసు కూడా జారీ  చేశామన్నారు.

Also read

Related posts

Share via