కదిరి టౌన్ (అనంతపురం) : కదిరి పట్టణంలోని పద్మావతి హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. మంగళవారం మృతుల తరపు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం … శ్రీ సత్యసాయి జిల్లా ఎన్ పి కుంట మండలం జౌకల గ్రామంకి చెందిన ఓబుల రెడ్డి, హరిణి లకు ఏడాది క్రితం వివాహమైంది. హరిణి ప్రసవం నిమిత్తం కదిరి పట్టణంలోని పద్మావతి హాస్పిటల్ కి వచ్చింది. ఆసుపత్రిలో చేరి వారం అయినా… డాక్టర్ మారుతి ప్రసాద్ సకాలంలో వైద్యం అందించకపోవడం వైద్యుడి నిర్లక్ష్యంతో తల్లి బిడ్డ మృతి చెందారని ఆరోపిస్తూ …. హాస్పిటల్ ఎదురుగా జాతీయ రహదారిపై బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే డాక్టర్ మారుతి ప్రసాద్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తల్లి బిడ్డ మృతికి కారణమైన పద్మావతి హాస్పిటల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ … బాధితులకు మద్దతుగా సిపిఐ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు.
తరచూ ఇలాగే మరణాలు …
కదిరి పట్టణంలోని పద్మావతి హాస్పిటల్ లో వారం రోజుల క్రితం ప్రసవం కోసం హరిణి హాస్పిటల్లో చేరగా నార్మల్ డెలివరీ చేస్తానంటూ డాక్టర్ నిర్లక్ష్యం చేయడంతో తల్లి బిడ్డ మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పద్మావతి హాస్పిటల్ లో తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని తెలిపారు. గతంలో కదిరి పట్టణం మూర్తిపల్లి కి చెందిన ఓ మహిళ చికిత్స నిమిత్తం రాగా బిడ్డ అబార్షన్ అయిపోయిందని, అప్పట్లో ఆ దంపతులు ఆందోళన వ్యక్తం చేశారు అని గుర్తు చేశారు. అలాగే కదిరి మండలం వీరేపల్లి పేట కి చెందిన ఓ మహిళ చికిత్స కోసం రాగా బిడ్డ మృతి చెందింది. దీంతో అప్పట్లో ఆందోళన చేయగా గుట్టు చప్పుడు కాకుండా పోలీసు స్టేషన్ లో దుప్పటి పంచాయతీ చేసి కేసు నమోదు కాకుండా తప్పించుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. పద్మావతి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం, ధనదాహానికి మరిన్ని ప్రాణాలు బలికాకుండా ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దఅష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతవం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read
- పిజిఆర్ఎస్ ఫిర్యాదులను పరిష్కరించని గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది…
- తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారో ఎప్పుడైనా ఆలోచించారా..?
- హనుమాన్ జయంతి 2026: హనుమాన్ జయంతి ఎప్పుడు? ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయి!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- అయ్యో.. ఎంత పని జరిగింది.. మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సినోడు..!




