సూర్యగ్రహ జననం – 9*
సంజ్ఞ శయ్యాగారంలోకి అడుగుపెట్టి, బంగారు తలుపులు మూసింది. మంచం మీద పవ్వళించిన పతి దేవుణ్ణి ఒక్కసారి చూసి, మణి దీపం వద్దకు నడిచి, ఆర్పివేసింది. శయ్యామందిరంలో దీపం లేకపోయినా, చీకటి ఉండదు. తన పతిదేవుడున్నచోట. వెల్తురే! సంజ్ఞ చిరునవ్వుతో శయ్య వైపు చూసింది. పొడుగాటి కాంతి పుంజంలా సూర్యుడు !
సంజ్ఞ శయ్య వైపు అడుగులు వేసింది. ఆమె అందెలు సమ్మోహనకరంగా మోగుతూ, ఆమె నడకకు నేపథ్య సంగీతం అందిస్తున్నాయి. సంజ్ఞ మంచం మీద కూర్చుని, సూర్యుడి మీద చెయ్యి వేసింది. ఆమె గాజుల గలగల సూర్యుణ్ణి వెచ్చరించింది.
*”స్వామీ… మీ శరీరం నాకు చాలా ఇష్టం ! ఎప్పుడూ వెచ్చగా, మత్తు కలిగిస్తూ, హాయిగా ఉంటుంది !”* సంజ్ఞ పరవశంతో అంది. ఆమె మాటకు అర్థం చెబుతున్నట్లు ఆమె చెయ్యి సూర్యుడి శరీరాన్ని నిమిరింది.
“నీ శరీరం అంటే నాకు ప్రాణం ! ఎందుకో తెలుసా ?”* సూర్యుడు సంజ్ఞ భుజాల మీద చేతులు వేస్తూ అన్నాడు.
*”ఎందుకు ?”*
*”నువ్వు వరవర్ణినివి, సంజ్ఞ!”*
*”వరవర్ణినా ? అంటే ?”* సంజ్ఞ ప్రశ్నించింది.
“”అంటే… “శీతాకాలంలో సుఖకరమైన ఉష్ణాన్నీ, ఉష్ణ సమయంలో సుఖకరమైన శీతలాన్నీ అందించే అవయవాలు కలిగిన ఉత్తమాంగన !”* సూర్యుడు వివరించాడు.
*”నిజంగానా, స్వామీ ! మీ సంజ్ఞ శరీరానికి ఆ లక్షణాలున్నాయా ? నేను నిజంగా ‘వరవర్ణిని’ అంటారా ?”” సంజ్ఞ ఉల్లాసంగా అడిగింది.
*”నువ్వు కేవలం వరవర్ణినవే కాదు, ‘వరారోహమ కూడా !”* సూర్యుడు నవ్వాడు.
*”నువ్వు కేవలం వరవర్ణినవే కాదు, ‘వరారోహవు’ కూడా !”* సూర్యుడు నవ్వాడు.
*”వరారోహ…”” సంజ్ఞ చేతులు, బొమలు ముడివేస్తూ అంది. “”అంటే ఏమిటి స్వామీ ?”*
*”నన్ను కాదు, సంజ్ఞ ! ఆ ప్రశ్న నీ వాలుజడ కొస భాగాన్ని అడుగు !”* సూర్యుడు నవ్వాడు.
సంజ్ఞ కూడా అర్ధం చేసుకుంది. సిగ్గుతో మెలితిరుగుతూ, తన ముఖాన్ని భర్త హృదయం మీద దాచుకుంది.
నిర్వికల్పానంద శిష్యుల్ని సాభిప్రాయంగా చూశాడు. *”నవగ్రహాలలో మొదటి గ్రహదేవత గురించి విన్నారు కదా ! ఇప్పుడు రెండవ గ్రహదేవత అయిన ‘చంద్రుడి’ జన్మవృత్తాతం వినిపిస్తాను !”” అంటూ ప్రారంభించాడు. ‘”చంద్రుణ్ణి ‘ఆత్రేయుడు’ అని అంటారు. ఎందుకంటే ఆయన ‘అత్రి’ పుత్రుడు కాబట్టి ! ‘అత్రి మహర్షి’ ఎవరో మీకు గుర్తుందా ?””
*”బ్రహ్మ మానస పుత్రులలో అత్రి మహర్షి ఒకరని చెప్పారు కద, గురువుగారూ !”* చిదానందుడు అన్నాడు.
*”ఔను ! అత్రి ఎవరిని భార్యగా స్వీకరించాడో కూడా చెప్పాను .”* నిర్వికల్పానంద అన్నాడు.
*”అత్రి మహర్షి భార్య అనసూయ. అనసూయ ఎవరి కూతురో తెలుసా ?” “చెప్పండి గురువుగారూ !”* సదానందుడు అన్నాడు.
*”బ్రహ్మ మానసపుత్రుడు ‘కర్దముడు’ గుర్తున్నాడుగా! ఆయన భార్య దేవహూతి. అనసూయ దేవహూతీ, కర్దమ దంపతుల పుత్రిక. అనసూయను ధర్మపత్రిగా స్వీకరించిన అత్రి మహర్షి గృహస్థ జీవితం ప్రారంభించాడు. ఆ దంపతులకు చాలా కాలం పాటు సంతానం కలగలేదు. అనసూయ మాహా పతివ్రత. అసామాన్య విధానంలో, చివరికి తన పాతివ్రత్య మహిమతోనే అనసూయ సంతానాన్ని పొందగలిగింది. ఆ సంఘటన చాలా చిత్రమైంది. వినిపిస్తాను. వినండి !” అంటూ చెప్పసాగాడు నిర్వికల్పానంద.
శ్రీ గురు దత్తా
సేకరణ… ఆధురి భాను ప్రకాష్