దసరా పండుగ సందర్భముగా “నవదుర్గ స్తోత్ర పఠన పోటీ”.
వివరాలను తెలిపిన శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం.
ఒంగోలు:
అక్టోబరు 3వ తేది నుండి 12వ తేది వరకు జరుగుచున్న దసరా శరన్నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీగిరి గిరి ప్రదక్షణ కమిటీ, హిందూ ధార్మిక సంస్థ, ఒంగోలు వారిచే మహిమాన్వితమైన నవదుర్గా స్తోత్రం పఠనం పై పోటీ నిర్వహిస్తున్నారు. ఎవరైతే బాగా, చూడకుండా, తప్పులు పోకుండా, రాగయుక్తంగా పాడుతారో… పోటీలో పాల్గొన్న వారి నుండి బెస్ట్ ఆఫ్ త్రీ, మొదటి ముగ్గురికి శ్రీవారి ఆశీస్సులతో అక్టోబర్ నెలలో 12వ తేది, శనివారము నిర్వహించు శ్రవణానక్షత్ర శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీ విధివిధానాలు తెలుపుచూ.. ఈ పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చునని (ముఖ్యం గా చిన్న పిల్లలను ప్రోత్సహించమని), నవదుర్గా స్తోత్రమును చెప్తూ వీడియో తీయించుకుని 94921 80492 కి తమ పూర్తి వివరాలతో వాట్స్అప్ చేయమని తెలిపారు.
– పోటీదారులు పంపిన వీడియోలను శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ గ్రూప్ నందు ప్రచురించబడునని,
ఫోన్ అడ్డంగా ఉంచి వీడియో తీసిపంపాలని, వచ్చిన వీడియోలను న్యాయ నిర్ణేతలు పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తారు. న్యాయ నిర్ణీతలదే తుది నిర్ణయమని తెలిపారు.
వీడియోలు పంపవలసిన చివరి తేది: 10 అక్టోబరు 2024.
విజేతల ప్రకటన 12 అక్టోబరు 2024 ఉంటుందని, విజేతలకు ఫోన్ ద్వారా సందేశం ఇవ్వడం జరుగుతుందని వివరించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025