టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2016 ఏఓబీ ఎన్‌కౌైంటర్ తరువాత లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించాలని నాటి ఎస్ఆర్సి( సెక్యూరిటీ రివ్యూ కమిటీ ) సిఫార్సు చేసింది. తగిన భద్రత కల్పించాలి అంటూ 14 సార్లు రాష్ట్ర హోం శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ కి లోకేష్ భద్రతా సిబ్బంది లేఖలు రాశారు.
భద్రత సిబ్బంది సిఫార్సుతో…
దీనిపై స్పందించిన హోంశాఖ లోకేష్ కు జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మావోయిస్టు హెచ్చరికలు, ఎన్నికల్లో పర్యటించాల్సిన సమయంలో లోకేష్ కు ఈ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. లోకేష్ భద్రత సిబ్బంది సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని ఈ సౌకర్యం కల్పించింది.
Also read
- నేటి జాతకములు…15 మే, 2025
- మామ వెంటనే నా భార్యను మా ఇంటికి పంపు..!
- వినుకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
- నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు…108 సర్టిఫికెట్లు స్వాధీనం
- Hyderabad Tragedy: హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన పిల్లర్ గుంత!