July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న పేర్ని నాని ప్రధాన అనుచరుడు

*పేర్ని నానికి భారీ షాక్..!*

*తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న పేర్ని నాని ప్రధాన అనుచరుడు వైఎస్ఆర్సిపి యువజన విభాగం అధ్యక్షుడు,మైనార్టీ నాయకుడు S.K జలీల్..*

*మూడు తరాలుగా పేర్ని కుటుంబానికి అండగా ఉన్న  ముస్లిం మైనార్టీ కుటుంబం జలీల్.. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెదేపా కండువా కప్పుకోవడంతో బందరు వైసీపీలో అలజడి మొదలైంది..*

*మాజీ మంత్రి కొల్లు రవీంద్ర లాంటి గొప్ప వ్యక్తిని మనసున్న మనిషికి ఇంతకాలం వ్యతిరేకంగా పని చేసినందుకు నన్ను క్షమించండి.. జలీల్.*

*బందరు మైనారిటీలో పేరున్న కుటుంబం అధికార వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరటంతో మైనారిటీ సమాజం తెలుగుదేశంతోనే అని మరోసారి స్పష్టమవుతుంది..*

*బందర్లో సమీకరణాలు మారుతున్నాయి పేర్ని నాని, పేర్ని కిట్టుకు పూర్తిగా ఎదురుగాలి వీస్తుంది అన్న ప్రచారానికి నిలువెత్తు నిదర్శనం జలీల్ తెలుగుదేశం పార్టీలో చేరటం.*

*చివరి క్షణం వరకు అనేక ప్రయత్నాలు చేసిన పేర్ని నాని, పేర్ని కిట్టు.. అయినా కొల్లు రవీంద్ర తోనే నా ప్రయాణం ఆన్న జలీల్..*

*ఇంత మంచి వ్యక్తి నిజాయితీపరుడైన సౌమ్యుడైన కొల్లు రవీంద్ర పై హత్యాయత్నం అని అక్రమ కేసు మోపిన రోజే నేను చాలా కలత చెందాను.. జలీల్.*

*త్వరలోనే పేర్ని నాని కుట్రలు కుతంత్రాలు అవినీతి అక్రమాలు ప్రజలకు వివరిస్తా జలీల్.*

*ఎంతో నిబద్ధతగల కుటుంబాన్ని పేర్ని నాని ఇంత నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళని వేధింపులు గురి చేశాడంటే ఇతర నాయకులు కార్యకర్తల పరిస్థితి ఏంటని మిలియన్ డాలర్ల ప్రశ్న.*

తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో…..

*మజీర్ అహ్మద్ మాబ్బాస్,బషీర్ అహ్మద్,అప్సర ఐస్ క్రీమ్ మహమ్మద్ అలీ, ఆరిఫ్, అది సుమన్, అమీన్,ఖదీర్, ఖాదర్ ఉన్నారు.*

ఈ కార్యక్రమంలో తెదేపా నగర అధ్యక్షుడు ఇలియాష్ షా షా, పిప్పళ్ళ వెంకట కాంతారావు, ఖాజా, సలీం,ఆరిఫ్,ఖదీర్, మదిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via