నంద్యాల అర్బన్ : కారులోని ప్రేమజంటపై దుండగులు దాడి చేసి యువకుడిని చితకబాది, యువతీయువకుడి వద్ద ఉన్న డబ్బు, బంగారాన్ని దోచుకొని పరారైన ఘటన బుధవారం నంద్యాల శివారులో జరిగింది. నంద్యాల శివారులో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో వెంచర్ల లో ఆగి ఉన్న కారులోని యువతి, యువకుడి పై ముఖాలను కప్పుకున్న దుండగులు దాడి చేశారు. కారు అద్దాలపై రాళ్ళు విసిరి ధ్వంసం చేశారు. యువకుడిని విచక్షణారహితంగా కొట్టి డబ్బు, పక్కనే ఉన్న యువతి మెడ లోని గొలుసు లాక్కొని ఉడాయించారు. యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటనా స్థలానికి డీఎస్పీ జావలి ఆల్ఫోన్సా (ఐపీఎస్) క్లూస్ టీం వెళ్లి పరిశీలించింది. దారి దోపిడీ దొంగల పనా ? లేక ఇతర కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో నంద్యాల తాలుక పోలీసులు విచారణ చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బఅందాలతో దొంగల కోసం గాలిస్తున్నారు. ఇటీవలే శాంతి రాం హాస్పిటల్ వద్ద హైవే కు ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డు లో బైక్ పై వెళుతున్న వృద్ధ దంపతులపై దాడి తరహాలోనే ఈ సంఘటన కూడా జరగడం గమనార్హం
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025