SGSTV NEWS online
CrimeTelangana

నా ఆస్తి అనాథ పిల్లలకే చెందాలి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని విషాదాంతం!



హైదరాబాద్‌, మియాపూర్‌: ఒంటరితనం, మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్‌ ఎస్‌ఐ నర్సింహా రెడ్డి తెలిపిన మేరకు.. జగిత్యాల జిల్లా గోవిందపల్లికి చెందిన వెంకట్‌ రెడ్డి, పద్మ దంపతులకు ఓ కుమార్తె బక్కశెట్టి సింధూజ అలియాస్‌ తుషారిక (36), ఓ కుమారుడు ఉన్నారు.

సింధూజ హైటెక్‌ సిటీలోని నెక్స్ట్‌టర్న్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ మియాపూర్‌ గోకుల్‌ ప్లాట్స్‌లోని ప్రజయ్‌ మెగాపోలిస్‌ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివాసముంటోంది. సింధూజకు 2015లో వివాహం కాగా ఏడాదిన్నర తర్వాత భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవనం కొనసాగిస్తోంది.

ఈ క్రమంలో గురువారం ఉదయం సింధూజ పనిచేస్తున్న కంపెనీలో ఆమె స్నేహితుడు రాజీరెడ్డి ఫోన్‌ చేయగా స్పందించలేదు. దీంతో రాజీరెడ్డి ఆమె ఫ్లాట్‌కు వెళ్లి చూడగా సీలింగ్‌ ఫ్యాన్‌ రాడ్‌కు  ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. పోలీసులు సూసైడ్‌ నోట్‌ను గుర్తించారు. నాలుగు నెలలుగా తాను ఒంటరితనం, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని, ఈ పరిస్థితుల నుండి బయటపడలేకపోతున్నానని తెలిపింది.

తనకు పిల్లలు అంటే ఇష్టమని, తన బ్యాంకు ఖాతాలోని డబ్బులను అనాథ పిల్లలకు చేర్చాలని కోరింది. కోర్టులో వివాదంలో ఉన్న ఆస్తికి సంబంధించిన కేసులను కొనసాగించాలని, తన ఆస్తి మొత్తాన్ని కేర్‌ ట్రస్ట్‌కు అందేలా చూడాలని కోరుతూ సూసైడ్‌ నోట్‌ రాసింది.

Also read

Related posts