ఏపీలో మరో ఘోరమైన మర్డర్ జరిగింది. శ్రీసత్య సాయి జిల్లా కదిరి మండలం బండవాండ్లపల్లికి చెందిన నవీన్ (35) గ్రామ శివారులో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు
ఏపీలో మరో ఘోరమైన మర్డర్ జరిగింది. కొందరు దుండగులు 35 ఏళ్ల యువకుడిని తెల్లవారుజామున కత్తులతో పొడిచి పొడిచి హతమార్చారు. అక్రమ సంబంధమే ఈ మర్డర్‌కు ప్రధాన కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కత్తులతో పొడిచి పొడిచి
శ్రీసత్య సాయి జిల్లా కదిరి మండలం బండవాండ్లపల్లికి చెందిన నవీన్ (35)కు గతంలో పెళ్లైంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అనివార్య కారణాల వల్ల నవీన్ భార్య రెండు సంవత్సరాల కిందట ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి తండ్రి నవీన్ తన పిల్లలను చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే నవీన్ వేకువజామున బహిర్భూమికి వెళ్లగా.. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని గ్రామ శివారులో కత్తులతో దారుణంగా పొడిచి పొడిచి హత్య చేశారు
ఒకవైపు తల్లి రెండు సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పుడు తండ్రి హత్యకు గురికావడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. అయితే ఈ మర్డర్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Also read
- తెల్లారితే నిశ్చితార్థం.. షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు.. కట్‌చేస్తే..
- కనిపెంచిన తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోని మీరూ కొడుకులేనా.? వీరు ఏం చేశారో తెలిస్తే..!
- అక్క పెళ్లి కోసమని ఇంటికి వచ్చాడు.. అంతలోనే అనంతలోకాలకు..!
- ఏ కాలంలో ఉన్నాం మనం ఇంకా.. ఎటు పోతుంది సమాజం.. తాగుడు కోసం ఇంత దారుణమా?
- ఆస్తి వివాదం – వ్యక్తిపై యాసిడ్ దాడి – పరిస్థితి విషమం




