ఖమ్మం రియల్ ఎస్టేట్ వ్యాపారి రవిప్రసాద్ మర్డర్ మిస్టరీ వీడింది. ఏలూరుకు చెందిన ప్రియురాలు (వివాహిత) లావణ్యనే రవిప్రసాద్‌ను బనియన్‌తో గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
MURDER: ఖమ్మం జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారి రవిప్రసాద్ మర్డర్ మిస్టరీ వీడింది. ఏలూరుకు చెందిన ప్రియురాలు (వివాహిత) లావణ్యనే రవిప్రసాద్‌ను బనియన్‌తో గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. లావణ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు తెలిపారు.
అక్రమసంబంధం పెట్టుకోవడంతో..
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా రాఘవాపురంకు చెందిన వివాహిత లావణ్య.. తన భర్త భర్త శ్రీనివాసరావుతో కలిసి రవిప్రసాద్ కట్టించిన బిల్డింగ్‌లో నివసిస్తోంది. ఈ క్రమంలోనే కొద్దికాలంగా రవిప్రసాద్‌తో అక్రమసంబంధం పెట్టుకోవడంతో శ్రీనివాస్ వదిలేశాడు. దీంతో ఖమ్మం నేతాజినగర్‌కు మకాం మార్చి రవిప్రసాద్‌తో లావణ్య సహజీవనం చేస్తోంది. అయితే తరుచూ మద్యం సేవిస్తూ లావణ్యను వేధించడం మొదలుపెట్టాడు రవిప్రసాద్.
ఏప్రిల్ 6న లావణ్యతో రవిప్రసాద్ మరోసారి ఘర్షణపడ్డాడు. ఈ వాగ్వాదంలో లావణ్య చేయి కొరికేశాడు. కోపంతో రగిలిపోయిన లావణ్య.. రవిప్రసాద్ బనియన్‌ను మెడకు బిగించగా ఊపిరాడక అక్కడిక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత మద్యం మత్తులో జారిపడగా తల గోడకు తగిలి చనిపోయాడని నమ్మించింది. రవిప్రసాద్ మృతిపై అతని కొడుకు పునీత్ సాయి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణలో రవిప్రసాద్‌ను చంపినట్లు లావణ్య అంగీకరించింది. ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025