న్యూ ఇయర్ వేడకల వేళ తెలంగాణ గంభీరావుపేటలో దారుణం జరిగింది. కూతురుకు శుభాకాంక్షలు చెప్పాడనే కోపంతో ఓ విద్యార్థిపై ఆమె కుటుంబ సభ్యులు దాడిచేశారు. దీంతో అవమానం తట్టుకోలేక శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పరారిలో ఉన్న నిందితులకోసం పోలీసులు గాలిస్తున్నారు
Murder: తెలంగాణలో న్యూ ఇయర్ వేడకల వేళ దారుణం జరిగింది. కొత్త యేడాది శుభాకాంక్షలు చెప్పినందుకు ఓ విద్యార్థిని దారుణంగా కొట్టి చంపిన ఘటన సంచలనం రేపింది. సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట భీముని మల్లారెడ్డి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోగా ఒక్కసారిగా జనం ఉలిక్కిపడ్డారు. ఆ బాలుడి కుటుంబం సభ్యులు గుండెలవిసేలా రోదించడం చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు ఈ ఇష్యూపై కేసు నమోదు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది.
తనతో పాటు చదువుకుంటున్న అమ్మాయికి..
ఈ మేరకు భీముని మల్లారెడ్డి గ్రామానికి చెందిన శివ కిషోర్ తనతో పాటు చదువుకుంటున్న ఇదే గ్రామానికి చెందిన అమ్మాయికి కొత్త సంవత్సరం శుభకాంక్షలు తెలిపాడు. అయితే శివ క్లాస్ మెట్ అయిన ఆ అమ్మాయి దీనిపై అసహనం వ్యక్తం చేసింది. అతడి విషెస్ ను తిరస్కరించి ముఖంపై తిట్టేసింది. అంతటితో ఆగకుండా తన కుటుంబ సభ్యులు, బంధువులకు శివ తనను వేధిస్తున్నాడని చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె ఫ్యామిలీ.. కిషోర్‌ను విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో వారి దాడిని అవమానంగా భావించిన శివ.. ఆత్మహత్యకు చేసుకున్నాడు
కుటుంబం మొత్తం పరారిలో..
ఇక శివ చనిపోయినట్లు తెలియగానే అమ్మాయి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి పారిపోయారు. శివకిషోర్ మరణానికి కారణమైన బాలిక కుటుంబసభ్యులు, బంధువులను కఠినంగా శిక్షించాలని శివ బంధువులు, గ్రామస్తులు పోలీసులను కోరారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన గంభీరావుపేట పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక టీమ్‌లుగా ఏర్పడి గాలిస్తున్నట్లు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.
Also Read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్‌తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!