SGSTV NEWS online
Spiritual

Mrityu Panchak 2026 Date: మృత్యు పంచకం ఎప్పుడు? ఈ తేదీల్లో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబంలో మరో ఐదుగురికి మరణ భయం తప్పదా?


Mrityu Panchak 2026: మృత్యు పంచకం జూన్ 6, 2026న ప్రారంభమవుతుంది. ఈ ఐదు రోజుల్లో ఏ జరిగినా, ఏ చేసినా దాని ఫలితం ఐదు రెట్లు అధికంగా ఉంటుందంటారు. మరి ఈ సమయంలో ఎవరైనా మరణిస్తే…

మృత్యు పంచకం జూన్ 6 సాయంత్రం నుండి 11 ఉదయం వరకు.
పంచకంలో మరణించినవారి ఆత్మకు, కుటుంబానికి కష్టాలు ఎదురవుతాయి.
దోష పరిహారానికి దర్భబొమ్మలు, దానాలు, శాంతి పూజలు నిర్వహించాలి.
ప్రయాణాలు మానుకుని ఆధ్యాత్మిక పరిహారాలు పాటించడం శుభదాయకం.


Mrityu Panchak Effect: ఈ ఏడాది మృత్యు పంచకం జూన్ 6 శనివారం సాయంత్రం 7:03 గంటలకు ప్రారంభమై, జూన్ 11న ఉదయం 8:16 గంటలకు ముగుస్తుంది. మృత్యు పంచకంలోని ఈ ఐదు రోజులు చాలా ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. అందువల్ల, ఈ సమయంలో అత్యంత జాగ్రత్త వహించండి. సాధారణంగా శుభకార్యాలకు శనివారం అశుభకరమైనదిగా భావిస్తారు..ఇక పంచకంలో కలిసినప్పుడు ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. పేరులో ఉన్నట్టు మృత్యు పంచకం మరణంతో సమానమైన బాధను కలగజేస్తుంది. .



మృత్యుపంచకం అంటే ఏంటి?


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 27 నక్షత్రాలున్నాయి. వాటిలో చివరి ఐదు నక్షత్రాల (ధనిష్ఠ చివరి సగం, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి) సమూహాన్ని పంచకకాలంగా పరిగణిస్తారు.

ఈ 5 రోజుల్లో మరణిస్తే ఏం జరుగుతుంది?
గరుడ పురాణం ప్రకారంఈ నక్షత్రాల కాలంలో మరణం సంభవిస్తే దాన్ని పంచకమరణం అంటారు. ఈ నక్షత్రాల కాలంలో ఓ వ్యక్తి మరణిస్తే ఆ ఆత్మ ఉత్తమ గతులు చేరకుండా ఆటంకాలు ఎదురవుతాయని, ఆ కుటుంబంలో మరో ఐదుగురికి మరణ భయం లేదా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని గరుడపురాణం ప్రేతకల్పంలో ఉంది. అందుకే ఈ పంచక కాలాన్ని ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. 

గరుడ పురాణం ప్రకారం పరిహారాలు ఏంటి?
పంచక దోషం ఉన్నప్పుడు మృతదేహానికి దహన సంస్కారాలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విధులు పాటించాలని సూచిస్తోంది గరుడ పురాణం. దర్భలతో ఐదు బొమ్మలు తయారు చేసి..ఆ ఐదు బొమ్మలకు ప్రాణప్రతిష్ఠ మంత్రాలు చదివి, యమధర్మరాజుని ప్రశన్నం చేసుకునేందుకు ప్రత్యేక మంత్రాలు పఠించాలి. మృతదేహాన్ని దహనం చేసేటప్పుడు ఈ ఐదు బొమ్మలను కూడా చితిపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల మరణించిన వ్యక్తికి చెందిన కుటుంబంలో ఇంకెవరిపైనా ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండని, మరణించిన వ్యక్తికి కూడా సద్గతి కలుగుతుందని నమ్మకం. పదో రోజు లేదా పదకొండో రోజు పంచక శాంతి నిర్వహించాలి. దాన ధర్మాలు చేయాలి. మనిషి మరణించిన తర్వాత.మొత్తం 16 పట్టణాలు దాటుకుంటూ ప్రయాణిస్తుంది ఆత్మ. పంచక కాలంలో మరణించిన ఆత్మకు ఈ ప్రయాణం అత్యంత కష్టతరంగా ఉంటుంది. అందుకే ఇక్కడ పిండ ప్రదానం , షోడశ కర్మలు నిర్వహిస్తారు. అన్నదానం, భూదానం, గోదానం ఇవన్నీ ఆత్మకు మార్గ మధ్యలో చల్లని నీడను, ఆహారాన్ని అందిస్తాయి


మృత్యు పంచకం అనేది భయపడాల్సిన విషయం కాదు.. అది కూడా ప్రకృతి కాలచక్రంలో ఓ భాగం. శాస్త్రక్తమైన పరిహారాలు పాటించడం ద్వారా ఆ దోషం నుంచి విముక్తి లభిస్తుందని సూచిస్తారు ఆధ్యాత్మికవేత్తలు
పంచక సమయంలో ప్రయాణాలు చేయకుండా ఉండడమే మంచింది. ఈ సమయంలో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందట. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు..

Also read

Related posts