November 21, 2024
SGSTV NEWS
Crime

వైసిపి ఆధ్వర్యంలో పోస్టల్‌ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన




విజయనగరం: పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారంపై అనుమానాలు కలుగుతున్నాయని, అధికారులు తీరు చూస్తే అర్థమవుతుందని విజయనగరం నియోజకవర్గ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు, పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆరోపించారు. విజయనగరంలో అధికారుల తీరును మీడియాకు వివరించారు. అధికారులు అడ్డంగా దొరికిపోయి పొంతనలేని సమాధానాలు ఇస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈనెల 16న ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి అల్లుడు ఈశ్వర్‌ కౌశిక్‌, ఎంపీపీ మామిడి అప్పల నాయుడు ఆధ్వర్యలో పోస్టల్‌ బ్యాలెట్‌లను తరలించడంపై పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని తెలిపారు.
పోటీ చేస్తున్న అభ్యర్థులకు కనీస సమాచారం ఇవ్వకుండా, వైసిపి నాయకుల ఆధ్వర్యంలో తరలించడంపై అనుమానాలు పెరుగుతున్నాయన్నారు. జనరల్‌ ఏజెంట్‌, అభ్యర్థి కానప్పుడు వారి ఆధ్వర్యంలో బ్యాలెట్‌లను ఎలా తరలిస్తారని మండిపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండ్రోజుల తర్వాత వైకాపా జనరల్‌ ఎజెంట్‌ అని అధికారులు ఉత్తరం పంపించారని తెలిపారు. అధికారుల తీరు చూస్తుంటే వైసిపికి కొమ్ముకాస్తున్నట్టు ఉందని విమర్శించారు. ఆ రోజే ఈ విషయం మీడియా ముందు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మార్వో, ఎమ్మెల్యేకి ఉన్న వ్యవహరాలు రోజూ మీడియాలో చూస్తున్నామన్నారు. అధికారుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు

Also read

Related posts

Share via