SGSTV NEWS
Andhra PradeshCrime

మరికాసేపట్లో కూతురి పెళ్లి.. అంతలోనే తల్లి గుండెపోటుతో మృతి


గజపతినగరం  : మరికాసేపట్లో జరగబోయే తన కూతురి పెళ్లి చూడకుండానే తల్లి గుండె ఆగింది. వధువు తల్లి ఒక్కసారిగా స్వహతప్పి గుండెపోటుతో కుప్పకూలింది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గజపతినగరం మండలం పాతబగ్గాo గ్రామానికి చెందిన పప్పల పైడమ్మ (50) తన కూతురు గౌరీ వివాహాన్ని ఆదివారం ఇంటి వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించింది. పెళ్లి ముహూర్తం మరి కొంత సమయంలో దగ్గర పడుతుంది. అనే సమయంలో పెళ్లి హడావిడిలో ఉన్న వధువు తల్లి పైడమ్మ ఒక్కసారిగా స్వహతప్పి పడిపోయింది. దీంతో బంధువులు స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ కు చూపించగా గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించడంతో ఒక్కసారిగా పెళ్ళంట విషాదఛాయలు అలుముకున్నాయి. వధువు తండ్రి మూడు సంవత్సరాల కిందట అనారోగ్యంతో మృతి చెందడంతో కూలి పనులు చేస్తూ తల్లి ఇంటిని నెట్టుకు వచ్చేది. పెళ్లికూతురు కి అన్నీ తనే అయ్యి వ్యవసాయ పనులు చేస్తూ.. కష్టపడి సంపాదించిన డబ్బులు కూడగట్టి… పెళ్లికి ఎంతో అంగరంగ వైభవంగా సిద్ధమైనప్పటికీ ఒక్కసారిగా తల్లి గుండెపోటుతో మృతి చెందడంతో వధువు శోకసముద్రంలో మునిగిపోయింది. పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు, గ్రామ ప్రజలు వధువు కన్నీరు పెట్టడం చూసి చలించకపోయారు. తండ్రి మూడు సంవత్సరాల కిందటే మృతి చెందడం, తల్లి గుండెపోటుతో హఠాత్తుగా పెళ్లి రోజే కూతురు పెళ్లి చూడకుండానే తుది శ్వాస విడవడo వధువు గౌరీ అనాధగా మిగలడంతో.. తల్లి మరణ వార్త పెండ్లి ఫంక్షన్ లో ఉన్న వారందరికీ తెలియడంతో, వారంతా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. ఎంతో ఆడంబరంగా పెళ్లి చేసినప్పటికీ, ఆ పెళ్లి చూడకముందే తల్లి మృతి చెందడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని దుఃఖాన్ని మిగిల్చింది .పెళ్లికి హాజరైన వారంతా సాయంత్రం పాతబగ్గాంలో జరిగిన అంత్యక్రియలో పాల్గొన్నారు.

Also read

Related posts

Share this