April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Nellore: గణేష్ నిమజ్జన ర్యాలీలో అపశృతి.. 30 మందికి గాయాలు



నెల్లూరు జిల్లా మనుబోలు బీసీకాలనీలో ఆదివారం రాత్రి నిర్వహించిన గణేష్ నిమజ్జన ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. వినాయకుని నిమజ్జనోత్సవంలో బాణసంచా పేలడంతో 30మందికి పైగా గాయపడ్డారు.

మనుబోలు: నెల్లూరు జిల్లా మనుబోలు బీసీ కాలనీలో ఆదివారం రాత్రి నిర్వహించిన గణేష్ నిమజ్జన ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. వినాయకుని నిమజ్జనోత్సవంలో బాణసంచా పేలడంతో 30మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

స్థానికుల కథనం ప్రకారం.. మనుబోలు బీసీ కాలనీలోని వరసిద్ధి వినాయకుని ఆలయం వద్ద చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి నిమజ్జనోత్సవం చేసేందుకు సిద్ధమయ్యారు. భారీగా బాణసంచా తీసుకొచ్చి మండపం సమీపంలోని ఓ ఇంటి వరండాలో, ప్రహరీ పక్కన నిల్వ ఉంచారు. ఈ క్రమంలో టపాసులు కాలుస్తుండగా నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో పక్కనే ఉన్న టపాసులపై పడటంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. పెద్ద మొత్తంలో బాణసంచా పేలడంతో అక్కడే ఉన్న కొందరు ఎగిరి పక్కన పడ్డారు. టపాసులు నిల్వ ఉంచిన ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్న రేకుల ఇళ్లు, ఇంటి తలుపులు, అద్దాలు, గేట్లు ధ్వంసమయ్యాయి. కరెంటు తీగలు కాలిపోయాయి. అక్కడే ఉన్న వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఒకవైపు అరుపులు, కేకలు, ఆర్తనాదాలు, రోదనలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది.



Also read

Related posts

Share via