SGSTV NEWS online
CrimeNational

అమ్మ మీ అల్లుడు తేడా.. సంసారానికి పనికిరాడు..



బెంగళూరు: సంసారం చేయడం లేదు, అలాగే పురుషత్వ పరీక్షకు  ఒప్పుకోకుండా పరారైన భర్త ఉదంతం నెలమంగలలో జరిగింది. బెంగళూరు హెసరఘట్ట నివాసి అయిన యువతి (26)కి, నెలమంగలకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అయిన వరునితో (30) గత జూన్ 9న వివాహం జరిగింది. మొటి రాత్రే భర్త అంటీముట్టనట్టుగా ప్రవర్తించినా, గొడవ కాకూడదని ఆమె అలాగే సంసారం నెట్టుకొస్తోంది.

ఆరు నెలలు గడిచినా నెల తప్పలేదని అత్తమామలు ఆమెను వేధించడంతో ఆమె వైద్య పరీక్షలు చేయించుకుంది. అన్ని రిపోర్టులు మామూలుగా వచ్చాయి, అయితే భర్త మాత్రం పురుషత్వ పరీక్ష అనగానే ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. భర్త చేత పురుషత్వ పరీక్ష చేయించాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంసారం చేయడం లేదని అడిగినందుకు అదనపు కట్నం పేరుతో భర్త, అత్తమామలు వేధిస్తున్నారని కూడా ఫిర్యాదులో తెలిపింది.

Also Read

Related posts