December 12, 2024
SGSTV NEWS
Viral

Mohan Babu: మనోజ్ నువ్వు నా గుండెల మీద తన్నావ్..మోహన్ బాబు వీడియో


తన కుటుంబంలో జరుగుతున్న గొడవలపై మోహన్‌ బాబు స్పందించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న మనోజ్ ఈరోజు గుండెల మీద తంతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  తాగుడుకి అలవాటు పడి చెడు మార్గంలో వెళుతున్నాడని చెపుతూ ఆడియో సందేశం విడుదల చేశారు మోహన్ బాబు.



మనోజ్ నువ్వు నా బిడ్డవి. విష్ణు, లక్ష్మి, మనోజ్..మిమ్మల్ని అందరినీ సమానంగా పెంచాను. అందరి కంటే ఎక్కువ నిన్న ముద్దు చేశాను.  నిన్ను అల్లారు ముద్దుగా పెంచాను. నీ చదువు కోసం చాలా ఖర్చు పెట్టాను..తాగుడికి అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నావు అంటూ మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. గొడవ జరిగిన తర్వాత మొదటిసారిగా మోహన్ బాబు స్పందించారు. దీనిపై ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. నా మనసు ఆవేదనతో కుంగిపోతోంది. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం. ప్రతీ కుటుంబంలోనూ గొడవలు ఉంటాయి. నువ్వు ఏది అడిగినా ఇచ్చాను. ఇప్పుడు నా గుండెల మీద తన్నావు అంటూ మోహన్ బాబు కన్నీటి పర్యంతం అయ్యారు.

నిన్ను కనడమే నా పాపం..
మనోజ్ రోడ్డుకెక్కి నా పరువు తీశావు.  జల్‌పల్లి ఇల్లు నా కష్టార్జితం. నీకు సంబంధం లేదు. ఇంట్లో వారిపై దాడి చేయడం సరికాదు. మద్యం మత్తులో ఎలాగో ప్రవర్తిస్తున్నావు. దౌర్జన్యంగా నా ఇంట్లోకి మనోజ్ వచ్చావు. నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. నీ కుతురిని వచ్చి తీసుకెళ్లు.. నా దగ్గర వదిలిపెట్టినా ఇబ్బంది లేదు. ఎవరికి ఎంత ఆస్తి ఇవ్వాలన్నది నా ఇష్టం. పిల్లలకు నా ఆస్తి ఇస్తానా.. దానధర్మాలు చేస్తానా అనేది పూర్తిగా నా ఇష్టం. ఎవ్వరూ దానిని శాసించలేరు అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఇక చాలు నా పరువు ప్రఖ్యాతలు మంటగలిపావు. నన్ను ఎవరూ మోసగాడు అనలేదు. నీకు జన్మనివ్వడమే నేను చేసిన పాపం. మనోజ్‌ నీ వల్ల మీ అమ్మ ఆసుపత్రిలో చేరింది. భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావు. తప్పు చేయనని చెప్పి మళ్లీ ఇంట్లోకి వచ్చావు. ఇక చాలు.. ఇంతటితో గొడవకు ముగింపు పలుకుదాం అని ఆడియోలో చెప్పారు.

Also read

Related posts

Share via