హైదరాబాద్ MMTSలో యువతిపై అత్యాచారయత్నం కేసులో బిగ్‌ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధితురాలు చెప్పిన పోలికల ఆధారంగా మేడ్చల్ జిల్లాకు చెందిన పాతనేరస్తుడు మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ బాధితురాలు నిందితున్ని చూసి అతను కాదని చెప్పినట్టు సమాచారం.
రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోని MMTS రైలులో ఓ యువతిపై దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో భయపడిన ఆ యువతి రన్నింగ్ ట్రైన్‌లో నుంచి కిందకి దూకేసింది. ప్రస్తుతం ఆ యువతికి యశోద హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగానే పోలీసులు పాత నేరస్తుల ఫొటోలను బాధితురాలికి చూపిస్తున్నారు. అందులో ఒక పాత నేరస్తుడి ఫొటో.. నిందితుడికి దగ్గర పోలికలు ఉన్నట్లు ఆ బాధిత యువతి చెప్పడంతో తాజాగా ఆ అనుమానితుడి జాడను పోలీసులు కనుగొన్నారు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన జంగం మహేశ్‌గా గుర్తించారు
అతడు.. ఇతడు కాదు
అతడిని తీసుకొచ్చి బాధిత యువతి ముందు ఉంచారు. తీరా అతడిని చూశాక ఆ యువతి పోలీసులకు షాక్ ఇచ్చింది. నిందితుడు అతడు కాదని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఈ కేసు విచారణ మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. అయితే పోలీసులు మహేశ్‌తో పాటు మరికొందరు నిందుతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు తమదైన శైలిలో విచారిస్తున్నారు.
అన్ని స్టేషన్‌లో పలు కోణాల్లో విచారిస్తున్నారు. నిందితుడు అల్వాల్ రైల్వేస్టేషన్ నుంచి MMTS ట్రైన్ ఎక్కినట్లు నిర్ధారించుకున్నారు. కానీ అతడు ఎక్కడ దిగిపోయాడు అనేది మాత్రం స్పష్టత లేదు. దీంతో పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు
Also read
- Malavya Rajyog 2025: వచ్చే నెలలో ఏర్పడనున్న మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశులకు మహర్దశ ప్రారంభం..
- నేటిజాతకములు …24 అక్టోబర్, 2025
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్‌గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే