SGSTV NEWS
CrimeTelangana

MLA Attack:  ఎమ్మెల్యేపై వాటర్‌ బాటిల్‌తో దాడి.. తప్పిన మరో గన్ మెన్ ఫైరింగ్..


క్యూన్యూస్‌ కార్యాలయంపై దాడి నేపథ్యంలో గన్‌మెన్‌ కాల్పులు జరిపిన ఘటన మరవకముందే మరో గన్‌మెన్ ఫైర్‌ ఓపెన్‌ చేసేందుకు సిద్ధపడ్డ ఘటన కలకలం సృష్టించింది. చివరినిమిషంలో గన్‌మెన్‌ తన ప్రయత్నాన్ని విరమించుకోవడంతో మరో ఫైరింగ్‌ ఘటన తప్పిందన్న  ప్రచారం సాగుతోంది.

Crime: క్యూన్యూస్‌ కార్యాలయంపై దాడి నేపథ్యంలో గన్‌మెన్‌ కాల్పులు జరిపిన ఘటన మరవకముందే మరో గన్‌మెన్ ఫైర్‌ ఓపెన్‌ చేసేందుకు సిద్ధపడ్డ ఘటన కలకలం సృష్టించింది. చివరినిమిషంలో గన్‌మెన్‌ తన ప్రయత్నాన్ని విరమించుకోవడంతో మరో ఫైరింగ్‌ ఘటన తప్పిందన్న  ప్రచారం సాగుతోంది. వివరాల ప్రకారం…


మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పై కాంగ్రెస్ కార్యకర్తలు వాటర్ బాటిల్ విసరగా, గన్ మెన్ అప్రమత్తమై దానిని అడ్డుకున్నాడు. సంఘటన మరింత తీవ్రతకు దారి తీసే లోపు పోలీసులు రంగప్రవేశం చేయడంతో గన్ మెన్ వార్నింగ్ కాల్పులు జరపడం తప్పినట్లయిందని తెలుస్తోంది. మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఆలయాలకు బోనాల పండుగ సందర్భంగా చెక్కుల పంపిణీ కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అల్వాల్ బాలాజీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారికోసం కుర్సీలు కూడా ఏర్పాటు చేశారు.అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు కేటాయించిన స్థానంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చోవడంతో వాగ్వివాదం నెలకొని తోపులాటకు దారి తీసింది.

ఈ తోపులాటలో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ భర్తపై కాంగ్రెస్‌ నాయకులు దాడి చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి పై కూడా వాటర్ బాటిల్ విసిరారు. అప్రమత్తమైన గన్ మెన్ వెంటనే దాన్ని అడ్డుకున్నాడు. పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీస్తే గన్ మెన్ వార్నింగ్ కాల్పులకు సిద్ధమయ్యాడని సమాచారం. అయితే అప్పటికే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో గన్‌మెన్‌ కాల్పుల ఉద్ధేశాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. అక్కడికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి మాట్లాడుతూ,.. సంఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్నామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు చెప్పారు.

Also read

Related posts

Share this