చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని షేక్షావలితో చెప్పడంతో దాడి చేసినట్లు పుల్లారెడ్డి ఆరోపించారు.
.Mining Mafia : నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. టీడీపీ నేత బీటెక్ పుల్లారెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడింది. తమ్మరాజుపల్లె మైనింగ్ మాఫియా హత్య చేయడానికి తెగబడింది. స్కార్పియో, బొలెరో వాహనాల్లో 15 మంది మైనింగ్ మాఫియా సభ్యులు వచ్చారు. మూకుమ్మడిగా రెండు కార్లలోంచి దూకి పుల్లారెడ్డి, ఆయన కొడుకుపై దాడి చేశారు. పాణ్యం బస్ స్టాండ్ సమీపంలోని జుర్రాకు వద్ద ఈ ఘటన జరిగింది.
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బీటెక్ పుల్లారెడ్డి, ఆయన కొడుకుపై ఒక్కసారిగా రాడ్లు, కర్రలతో షేక్షావలి అతని అనుచరులు దాడి చేశారు. పుల్లారెడ్డి, అతడి కొడుకుని శాంతిరాం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ్మరాజుపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై షేక్షావలిని ప్రశ్నించిందుకు దాడి చేసినట్లు పుల్లారెడ్డి చెబుతున్నారు.
గ్రామంలోని టిప్పర్లు, మైనింగ్ యజమానుల నుంచి షేక్షావలి నెల నెల అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు పుల్లారెడ్డి ఆరోపించారు. టీడీపీ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని షేక్షావలితో చెప్పడంతో దాడి చేసినట్లు పుల్లారెడ్డి ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Also read
- ‘నేను చచ్చిపోయినా బాగుండేది’.. అమీన్పూర్ ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన!
- హెల్త్ సూపర్వైజర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సుపారీ ఇచ్చి మరీ భార్య దారుణంగా!
- Lady Aghori-Sri Varshini: అఘోరీ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. వర్షిణిని రప్పా రప్పా ఈడ్చుకెళ్లిన ఫ్యామిలీ
- ప్రయాణిస్తున్న రైలు వాష్‌రూమ్‌లో వేధింపులు.. వీడియోలు రికార్డింగ్
- ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో