మొబైల్ పోయిందని పోలీస్ స్టేషన్కు వెళ్లిన వ్యక్తిని అక్కడి కానిస్టేబుల్ కొట్టి పంపించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాధితుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అల్లాదుర్గం: మొబైల్ పోయిందని పోలీస్ స్టేషన్కు వెళ్లిన వ్యక్తిని అక్కడి కానిస్టేబుల్ కొట్టి పంపించాడు. దీంతో మనస్తాపానికి గురైన బాధితుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో జరిగింది. రాంపుర్ గ్రామానికి చెందిన తలారి కిషన్ (33) మొబైల్ ఈ నెల 5న తన గ్రామంలోనే పోయింది. అదే రోజు రాత్రి అల్లాదుర్గం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సాయిలు బాధితుడిని కొట్టి పంపించాడు.
తిరిగి 6న మళ్లీ స్టేషన్కు వెళ్లగా.. అక్కడి పోలీసులు దుర్భాషలాడి తిట్టి మళ్లీ తిరిగి పంపించారు. దీంతో మనస్తాపానికి గురైన కిషన్ స్థానిక ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు. మృతికి కారణమైన కానిస్టేబుల్ సాయిలుని వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పినట్లు స్థానికులు తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025