దోషాలు తొలగించి శుభాలు కలిగించే మత్స్య జయంతి శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారం. వేదాలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారమే మత్స్యావతారం. చైత్ర శుద్ధ పంచమి రోజు రానున్న మత్స్య జయంతి విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మత్స్య జయంతి ఎప్పుడు?
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని శ్రీహరి స్వీకరించింది చైత్ర శుద్ధ పంచమి. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీ గురువారం చైత్ర శుద్ధ పంచమి రోజున మత్స్యజయంతి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా మత్స్యావతార విశిష్టతను తెలుసుకుందాం.
మత్స్యావతార విశిష్టత
పురాణాల ప్రకారం పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు నివసించే వాడు. అతడు కశ్యప మహాముని, దను దంపతుల పుత్రుడు. కశ్యపుడు ప్రజలకు మానవత్వాన్ని వరంగా ప్రసాదించాడు. ఇది ఇష్టం లేని హయగ్రీవుడు తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఈ కారణంగా దానవులకు రాజుగా హయగ్రీవుడు సింహాసనాన్ని అధిరోహించాడు. సాధారణ ప్రజలు రాక్షసుల కంటే శక్తిమంతులు కాకుండా అడ్డుకునేందుకు అన్ని విధాల ప్రయత్నించాడు. యజ్ఞయాగాదులు ధ్వంసం చేశాడు. ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేశాడు.
వేదాలు అపహరణ
శ్రీ మహావిష్ణువు నాలుగు వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని తెలుసుకొని వాటిని మానవులకు చెందకూడదని భావించాడు. వెంటనే వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడు. పరమ పవిత్రమైన నాలుగు వేదాలు ధర్మాన్ని రక్షించడమే కాకుండా సమస్త మానవాళిని ముందుకు నడిపించే మార్గనిర్దేశకాలు. ఈ వేదాలు రాక్షసుల చేతికి వెళ్తే వినాశనం తప్పదని శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించి వాటిని రాక్షసులకు దూరం చేయాలని తన తొలి అవతారాన్ని ఎత్తాడు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుడును సంహరించి వేదాలను రక్షించి వాటిని తిరిగి బ్రహ్మదేవునికి అప్పగిస్తాడు.
మత్స్యజయంతి అందుకే
శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని స్వీకరించిన రోజునే మత్స్యజయంతిగా జరుపుకుంటాం. మత్స్యజయంతి రోజు శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజిస్తారు. అలాగే ఈ రోజు మత్స్య పురాణం, విష్ణు సహస్రనామ పారాయణాలు కూడా విశేషంగా చేస్తారు.
ఈ దానాలు శ్రేష్టం
మత్స్యజయంతి రోజు అన్నదానం, వస్త్రదానం, జలపాత్ర వంటివి దానం చేయడం శుభకరం. అలాగే ఈ రోజు బ్రాహ్మణులకు గోదానం చేయడం వలన కూడా విశేషమైన శుభఫలితాలు ఉంటాయని విశ్వాసం.
దేశంలో ఒకటే ఆలయం
మత్స్యజయంతిని వైష్ణవాలయాల్లో ఘనంగా జరుపుకుంటారు. మన దేశంలో మత్స్యావతారానికి ఒకే ఒక దేవాలయం ఉంది. తిరుపతికి 70 కి.మీ. దూరంలో ఉన్న నాగలాపురం గ్రామంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయ అభివృద్ధికి శ్రీకృష్ణదేవరాయలు చాలా సహకరించినట్లు అక్కడి శాసనాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ గుడిని వేదనారాయణస్వామి ఆలయం అని పిలుస్తారు. రానున్న మత్స్య జయంతి రోజు మనం కూడా శ్రీమహావిష్ణువును పూజిద్దాం తరిద్దాం. ఓం నమో నారాయణాయ!
MATSYA JAYANTI STORY
MATSYA JAYANTI SPECIAL
MATSYA JAYANTI TELUGU
MATSYA JAYANTI SIGNIFICANCE
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారం. వేదాలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారమే మత్స్యావతారం. చైత్ర శుద్ధ పంచమి రోజు రానున్న మత్స్య జయంతి విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.