July 3, 2024
SGSTV NEWS
CrimeTelangana

హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ సూత్రధారి అరెస్ట్



కేరళ కిడ్నీ రాకెట్ కేసులో కీలక నిందితుడిని కేరళ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. బల్లంకొండ రాంప్రసాద్ అలియాస్ ప్రసాద్(41)ను ఎర్నాకుళం రూరల్ జిల్లా ఎస్పీ వైభవ్ సక్సేనా నేతృత్వంలోని పోలీస్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) హైదరాబాద్లో అదుపులో తీసుకొంది.

హోటల్లో పట్టుకున్న ఎర్నాకుళం రూరల్ సిట్ పోలీసులు విజయవాడకు చెందిన బల్లంకొండ రాంప్రసాద్ గుర్తింపు ఇరాన్లో ఉన్న మధుతో కలిసి దందా నడిపినట్లు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్: కేరళ కిడ్నీ రాకెట్ కేసులో కీలక నిందితుడిని కేరళ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. బల్లంకొండ రాంప్రసాద్ అలియాస్ ప్రసాద్(41)ను ఎర్నాకుళం రూరల్ జిల్లా ఎస్పీ వైభవ్ సక్సేనా నేతృత్వంలోని పోలీస్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) హైదరాబాద్లో అదుపులో తీసుకొంది. విజయవాడకు చెందిన ఇతను కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటున్నట్లు గుర్తించిన సిట్ బృందం.. కొద్దిరోజుల క్రితమే ఇక్కడికి వచ్చి గాలింపు చేపట్టింది. నగరంలోని ఓ హోటల్లో తలదాచుకున్న రాంప్రసాద్ను గురువారం పట్టుకుని కొచ్చికి తరలించింది. అక్కడి న్యాయస్థానంలో హాజరుపర్చింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని యువకులను ఇరాన్కు తరలించడంలో ఇతడు కీలకపాత్ర పోషించినట్లు తేలింది. కేరళలోని అలువాకు చెందిన మధుతో కలిసి రాంప్రసాద్ ఈ దందా నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఇరాన్లో స్థిరపడిన మధు సూచనలకు అనుగుణంగా కిడ్నీదాతల్ని పంపేవాడు. కిడ్నీ  విక్రయిస్తే రూ.20 లక్షలు ఇస్తామని దాతల్ని ఈ ముఠా నమ్మించి తీసుకెళ్లేది. ఖర్చుల పేరిట సగానికిపైగా కోత విధించి రూ.5-10 లక్షల వరకే ఇచ్చేది. రాంప్రసాద్ తనను తాను వైద్యుడిగా చెప్పుకొన్నా.. వైద్యుడిగా అతడికి ఎలాంటి అనుభవం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. తన కోసం కేరళ పోలీసులు గాలిస్తున్నారనే విషయం పసిగట్టిన అతను.. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే చిక్కాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు బెంగళూరు, ముంబయి, కేరళ, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 20 మందిని ఇరాన్కు తరలించినట్లు అనుమానిస్తున్న కేరళ పోలీసులు.. బాధితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కేరళలోని పాలక్కాడ్కు చెందిన సమీర్ను గత నెలలో రాంప్రసాదే ఇరాన్కు పంపించినట్లు దర్యాప్తులో తేలింది. అతడి కోసం హైదరాబాద్లో గాలించిన కేరళ పోలీసులు.. తెలంగాణ పోలీసులకు సమాచారమివ్వకుండా గోప్యత పాటించారు.

సామాజిక మాధ్యమాల్లో దాతల అన్వేషణ

కేరళలో గత నెల 21న రాత్రి త్రిసూర్కు చెందిన కిడ్నీ రాకెట్ ముఠా సభ్యుడు సబిత్ నాజర్ అరెస్ట్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సబిత్ నాజర్ తరచూ ఇరాన్ వెళ్లి వస్తున్నట్లు గుర్తించిన కేంద్ర నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో.. అతడిపై కేరళ పోలీసులు నిఘా ఉంచారు. లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అతడు చిక్కాడు. అతడిని విచారించిన క్రమంలోనే రాంప్రసాద్ పేరు వెలుగులోకి వచ్చింది. అతడిని పట్టుకొని విచారించడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడకు చెందిన రాంప్రసాద్.. తొలుత ఆర్థికావసరాల కోసం కిడ్నీ అమ్మేందుకు యత్నించాడు. అనారోగ్య కారణాలతో కిడ్నీ ఇచ్చేందుకు అతడికి అర్హత లేదని తేలింది. ఆ ప్రయత్నాల్లో ఉండగానే కిడ్నీ రాకెట్ ముఠా సూత్రధారి మధు పరిచయమయ్యాడు. అతడి సూచనతో దాతల్ని వెతికే పని ఆరంభించాడు. సామాజిక మాధ్యమాల్లో కిడ్నీదాతల గురించి అన్వేషించి… వారికి వల వేసేవాడు. ఎవరైనా దొరికితే తొలుత హైదరాబాద్లోని ల్యాబ్లో పరీక్షలు నిర్వహించి.. శస్త్రచికిత్సకు సరిపోతారని తేలితే ఇరాన్కు తరలించేవాడు. కొడ్కు ముందు నుంచే అతడు ఈ కార్యకలాపాలో  భాగస్వామిగా ఉన్నట్లు కేరళ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరినైనా ఇరాన్కు తీసుకెళ్లాడా అని ఆరా తీస్తున్నారు. రాంప్రసాద్ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే రాకెట్ సంబంధిత కీలక విషయాలు బహిర్గతమవుతాయని భావిస్తున్నట్లు ఎర్నాకుళం జిల్లా రూరల్ ఎస్పీ వైభవ్ సక్సేనా ఫోన్లో ‘ఈనాడు’కు తెలిపారు. మధుపై లుక్అవుట్ నోటీస్ జారీ చేసినట్లు పేర్కొన్నారు

Also read

Related posts

Share via