Andhra Pradesh: కడప జిల్లా పులివెందుల నగరంలోని ముద్దనూరు రోడ్డులో శివకాశి అనే విశ్రాంత ఉపాధ్యాయుడు చిట్టీలు నిర్వహించడం, వడ్డీ వ్యాపారం చేస్తూ తన మంచి తనంతో అందరినీ ఆక్టుకున్నాడు. స్థానికంగా ఉన్నవారు కూడా ఉపాధ్యాయ వృత్తి చేశాడు కాబట్టి వారు..
Massive Scam: టీచర్ ఉద్యోగం చేశాడు .. మంచిగా ఉంటాడులే అని నమ్మితే ఆ మంచితనాన్ని అడ్డంపెట్టుకుని … అందరినీ ముంచాడు. 70 మంది వద్ద 7 కోట్లకు టోకరా పెట్టాడు. అంతే కాకుండా వారందరికీ ఐపి నోటీసులు కూడా పంపించాడు ఆ ప్రభుద్దుడు . ఇంతకీ విషయం ఏమిటంటే. కడప జిల్లా పులివెందుల నగరంలోని ముద్దనూరు రోడ్డులో శివకాశి అనే విశ్రాంత ఉపాధ్యాయుడు చిట్టీలు నిర్వహించడం, వడ్డీ వ్యాపారం చేస్తూ తన మంచి తనంతో అందరినీ ఆక్టుకున్నాడు. స్థానికంగా ఉన్నవారు కూడా ఉపాధ్యాయ వృత్తి చేశాడు కాబట్టి వారు కూడా అతనిని నమ్మి చిట్టీలు వేశారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో డబ్బ స్వాహా చేసి ఇంటుకి తాళం వేసి పరారయ్యాడు.
అంతే కాక తాను డబ్బులు ఎగ్గొట్టిన వారికి చక్కగా ఐపీ నేటీసులు కూడా పంపించాడు. దీంతో ఖంగు తిన్న బాదితులు పులివెందుల పోలీసులను ఆశ్రయించారు. మొత్తం బాదితుల వద్దనుంచి ఇప్పటి వరకు 7 కోట్లు స్వాహా చేసినట్టు సమాచారం. భాదితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి టీచర్ అని నమ్మినందుకు మొత్తానికి గుండుగీకాడు.
Also read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?





