April 19, 2025
SGSTV NEWS
CrimeNational

ఇన్ స్టా  లవర్తో వివాహిత ప్రేమాయణం.. భర్త ఇంటికి వచ్చే సరికి..

ఛండీగఢ్: ఇటీవలి కాలంలో సోషల్ మీడియా పరిచయాలు  హత్యలకు దారితీస్తున్నాయి. కొందరు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. క్షణికావేశంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు.. వారిని జైలుపాలు చేస్తున్నాయి. తాజాగా ప్రియుడి కోసం భర్తనే హత్య చేసిన మరో దారుణ హర్యానాలో చోటుచేసుకుంది. సోషల్ మీడియా రీల్స్ వారి కాపురంలో చిచ్చుపెట్టింది.

వివరాల ప్రకారం.. హర్యానాలోని భివానీకి చెందిన ప్రవీణ్ రవీనాకు 2017లో వివాహం జరిగింది. వీరిద్దరికీ ముకుల్ అనే ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, రవీనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఒక యూట్యూబ్ రన్ చేస్తూ అందులో వీడియోలు షేర్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఆప్లోడ్ చేస్తుంటుంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం యూట్యూబర్ సురేష్తో రవీనాకు పరిచయం ఏర్పడింది. దీంతో, వారిద్దరూ స్నేహితులయ్యారు.

అనంతరం, ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఇద్దరూ కలిసి రీల్స్ కూడా చేశారు. ఇలా రెండేళ్ల పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు మరింత దగ్గరయ్యారు. శారీరకంగా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇలా గడుస్తున్న సమయంలో వారి వ్యవహారం భర్త ప్రవీణ్కు వీరి వ్యవహారం తెలిసింది. రవీనాకు గట్టిగానే హెచ్చరించాడు. ఈ క్రమంలో మార్చి 25వ తేదీన రవీనా ఇంటికి సురేష్ వచ్చాడు.. ఇదే సమయంలో ప్రవీణ్ ఇంటికి రావడంతో వారిద్దరూ. అభ్యంతరకర స్థితిలో దొరికిపోయారు. తర్వాత, వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, రవీనా, సురేష్ కలిసి.. ప్రవీణ్ హత్య చేశారు. అనంతరం, ప్రవీణ్ మృతదేహాన్ని తన బైక్పై తీసుకెళ్లి.. దూరంగా ఉన్న మురుగు కాలువలో పడేశారు. తర్వాత ఏమీ తెలియనట్టుగా ఉండిపోయారు.

ఈ ఘటన తర్వాత ప్రవీణ్ కనిపించకపోవడంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసకున్న పోలీసులు.. వారి ఇంటి వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా.. మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో, రవీనాను అదుపులోకి తీసుకుని పోలీసులు గట్టిగా విచారించగా.. అసలు విషయం చెప్పుకొచ్చింది. తన ప్రియుడు సురేష్తో కలిసి ప్రవీణ్ను హత్య చేసినట్టు ఒప్పుకుంది. ప్రస్తుతం సురేష్ పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also read

Related posts

Share via