ఏపీలోని పల్నాడు జిల్లా పట్టణంలో ఘోరం జరిగింది. ఓ నర్సింగ్ హోమ్‌లో వైద్యం వికటించడంతో వివాహిత మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగడంతో పాటు ఆసుపత్రి పై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ఆసుపత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఏపీలోని పల్నాడు జిల్లా పట్టణంలో ఘోరం జరిగింది. ఓ నర్సింగ్ హోమ్‌లో వైద్యం వికటించడంతో వివాహిత మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగడంతో పాటు ఆసుపత్రి పై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ఆసుపత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం పేదనెమలిపురి గ్రామానికి చెందిన అంకాల భూలక్ష్మి అనే వివాహిత శుక్రవారం తన ఇంట్లో బట్టలు ఉతుకుతుండగా బకెట్లో కనిపించని కీటకం ఏదో కుట్టింది. దీంతో అనుమానంతో చికిత్సకోసం పిడుగురాళ్లలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించిన అనంతరం ఇంటికి తీసుకెళ్లారు.
అయితే శనివారం రోజు భూలక్ష్మి తనకు తల నొప్పిగా ఉందని చెప్పడంతో బంధువులు ఆమెను పిడుగురాళ్లలోని విజయ నర్సింగ్ హోమ్ కు తీసుకెళ్లారు.అయితే వైద్యులు చికిత్స అందించిన అనంతరం భూ లక్ష్మి కోలుకుంది. అయితే ఆసుపత్రిలో ఉన్న భూలక్ష్మి ఆసుపత్రిలో చేరిన తర్వాత శనివారం సాయంత్రం నుండి ఆదివారం సాయంత్రం ఆరోగ్యంగానే ఉందని, అందరితో మాట్లాడుతూనే ఉందని బంధువులు తెలిపారు. ఆ తర్వాత కాంపౌండర్ ఏదో ఇంజక్షన్ ఇస్తున్న సమయంలోనే ఎగస్వాసతో భూలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న భూలక్ష్మి వైద్యుల నిర్లక్ష్యం మూలాంగానే చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. భూలక్ష్మి చనిపోయిన వెంటనే డాక్టర్లు వైద్య సిబ్బంది ఆసుపత్రి నుండి పరారయ్యారు. దీంతో బంధువులు ఆగ్రహంతో ఆసుపత్రి అద్దాలు పగలగొట్టి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు.
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





