ఆమెకు ఎన్నో కలలు ఉన్నాయి. మంచి ఇల్లు కట్టుకోవాలని, పిల్లలని బాగా చదివించుకోవాలని. కానీ భర్తే ఆమెకు విలన్ అయ్యాడు. దీంతో అతడికి దూరంగా ఉంటుంది. కానీ తనను టార్చర్ చేసి.. ఆమె హాయిగా ఉందనుకున్న భర్త..
పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటుంటారు పెద్దలు. కానీ ఈ రోజుల్లో నూరేళ్ల మంటగా మారిపోయింది. పెళ్లి అయినా కొన్ని రోజులకే వివాహ బంధం బీటలు మారుతుంది. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ లేకపోవడం, మనస్పర్థలు, గొడవలు, తగాదాలు, ఒకరిపై ఒకరు చేయిచేసుకోవడం చివరకు చంపుకోవడం వరకు వెళుతున్నాయి. పోనీ విడిపోయి ఎవరి జీవితం వారు హాయిగా గడుపుతున్నారా అంటే అదీ లేదు. జీవిత భాగస్వామిని వెంటాడుతూ, వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. తాజాగా కేరళతో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. భార్య విడాకులు కోరిందని, లైఫ్ ఎంజాయ్ చేస్తుందన్న అనుమానంతో ఏకంగా ఆమె పనిచేస్తున్న ఆఫీసులో భార్యకు నిప్పంటించాడు. ఈ ఘటనలో భార్యతో పాటు మరో వ్యక్తి సజీవ దహనం అయ్యారు.
తిరువనంతపురం పప్పనంకోడ్‌లోని బీమా ఏజెన్సీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. తొలుత ఇద్దరు మహిళలే చనిపోయారని అనుకున్నారు. కానీ ఆసుపత్రికి తరలించాక.. మృతుల్లో ఓ పురుషుడు కూడా ఉన్నాడని తేలింది. అయితే అతడు ఎవరో తెలియరాలేదు. అయితే మృతుల్లో విక్కుబాలికులం నివాసి వైష్ణగా గుర్తించారు. వైష్ణతో చనిపోయిన వ్యక్తి ఎవరు, ఈ ఘటన ఎలా జరిగింది అని పోలీసులు విచారణ చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైష్ణకు గతంలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోగా విడాకులు తీసుకుంది. మొదటి భర్త ఫ్రెండ్ బినుని ఏడేళ్ల క్రితం రెండో వివాహం చేసుకుంది.
పెళ్లైన దగ్గర నుండి భార్యా భర్తలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో బినుతో తన వివాహ సంబంధాన్ని తెంచుకునేందుకు వైష్ణ కోర్టును ఆశ్రయించింది. వైష్ణ బీమా కంపెనీలో ఆరేళ్ల నుండి వర్క్ చేస్తుంది. ఉదయం ఆఫీసు తెరిచి, సాయంత్ర క్లోజ్ చేసేది. ఆమెకు ఎన్నో కలలు ఉన్నాయి. సొంత ఇల్లు కట్టుకోవాలని, పిల్లలను బాగా చదివించాలని కోరుకునేది. అయితే ఆమెకు భర్త విలన్ అయ్యాడు. ఆమె ఉద్యోగం చేస్తున్న చోటుకు వెళ్లి బెదిరించేవాడు. తరచూ ఫోనులో చంపేస్తానంటూ భయపెట్టే సందేశాలు పంపేవాడు. దీంతో ఆమె భయపడి.. తనను ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో చేతిలో పెప్పర్ స్ప్రే తెచ్చుకునేది.
మంగళవారం కూడా యథా విధిగా ఆఫీసుకు రాగా.. అక్కడే కాపు కాచిన బిను.. కార్యాలయంలోకి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పొగలు రావడంతో స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ బట్టి భర్తే హంతకుడని తేలింది. అతడి కోసం పోలీసులు ఎంక్వైరీ చేయగా.. ఎలాంటి ఆచూకీ దొరకలేదు. కాగా, ఈ అగ్ని ప్రమాద ఘటనలో కంపెనీకి 5 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు కంపెనీ అధికారులు చెబుతున్నారు. కాగా, బిను ఫోను కూడా స్పందించకపోవడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక పరారీలో ఉన్నాడా తెలియాల్సి ఉందంటున్నారు పోలీసులు. బిను కాల్ డేటాను తనిఖీ చేస్తున్నారు. దర్యాప్తు వేగవంతం చేశారు. కాాగా, ఆమె టార్చర్ తట్టుకోలేక తన కొడుకు ఈ అఘాయిత్యం చేసి ఉంటాడని నిందితుడి తల్లి చెబుతుంది.
- Margashira Masam: పోలి పాడ్యమితో మార్గశిర మాసం ప్రారంభం.. గీతా జయంతి సహా విశిష్ట పండగలు ఏమిటంటే..
- నేటి జాతకములు 4 డిసెంబర్, 2024
- AP News: మాయ మాటలు చెప్పి బాలికను ట్రాప్ చేసిన మ్యాథ్స్ టీచర్.. కోర్టు సంచలన తీర్పు
- డోలి లో గర్భిణీని ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు..
- భార్యాభర్తల డ్రగ్స్ దందా!