February 24, 2025
SGSTV NEWS
CrimeTelangana

TG Crime: పెళ్లి ఒకరితో.. కాపురం మరొకరితో: నగ్నంగా పట్టుకుని పొట్టు పొట్టు కొట్టిన భార్య!


తెలంగాణలో మరో గవర్నమెంట్ టీచర్ అక్రమ సంబంధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లికి చెందిన హరిదాస్ మరో మహిళతో నగ్నంగా ఉండగా భార్య విజయ పట్టుకుని ఇద్దరినీ చితకబాదింది. పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

TG Crime: తెలంగాణలో మరో టీచర్ అక్రమ సంబంధ భాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో అందమైన భార్యను పెట్టుకుని మరొక స్త్రీతో కులుకుతుండగా అడ్డంగా బుక్కయ్యాడు. ప్రియురాలితో నగ్నంగా రాసలీలల్లో మునిగితేలుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అతని భార్య ఇద్దరినీ పొట్టుపొట్టు కొట్టింది. ఈ ఘటన భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి

ఒంటరి మహిళతో రిలేషన్..
చుంచుపల్లి మండలానికి చెందిన అజ్మీరా హరిదాస్ అనే వ్యక్తి 15 ఏళ్ల క్రితం పాల్వంచ మండలం పాండురంగాపురంకు చెందిన విజయ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు. ప్రస్తుతం లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు హరిదాసు. అయితే గతంలో ములకలపల్లి మండలం కమలాపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలో కిరణ్మయి అనే ఒంటరి మహిళతో పరిచయం ఏర్పడగా అది అక్రమ సంబంధానికి దారితీసింది

స్కూలుకు వెళుతున్నానంటూ అక్కడికి..
ఈ క్రమంలోనే రోజు స్కూలుకు వెళుతున్నానంటూ కిరణ్మయితో సహజీవనం చేయడం మొదలుపెట్టాడు హరిదాస్. భర్త హరిదాస్ వైఖరిలో మార్పు గమనించిన విజయ అతన్ని ఒకరోజు ఫాలో అయింది. పాఠశాలకు వెళ్లాల్సిన భర్త నేరుగా ఓ ఇంట్లోకి దూరడంతో అనుమానం వచ్చింది. కాసేపటికి ఆ ఇంట్లోకి వెళ్లి చూసిన విజయకు తన భర్త హరిదాస్ మరో మహిళతో ఉండటం కళ్లారా చూసింది. దీంతో తీవ్ర ఆందోళన చెందిన విజయ.. ఏం చేస్తున్నావ్ ఇక్కడ అంటూ నిలదీసింది. దీంతో కిరణ్మయిని పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ జరగగా తాను ఇకపై ఇంటికిరానంటూ భార్య విజయతో తెగేసిచెప్పాడు హరిదాస్.

అయితే భర్తతో గొడవపడి విజయ తిరిగి ఇంటికి వచ్చేసింది. కానీ హరిదాస్ మళ్లీ ఇంటికి రావడం మొదలుపెట్టాడు. నెలలు గడుస్తున్న వెళ్లిపోలేదు. తీవ్ర ఆగ్రహం తెచ్చుకున్న విజయ.. ఒక రాత్రి కుటుంబంతో కలిసి ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదింది. విజయ తరఫు కుటుంబసభ్యులు కిరణ్మయిపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను స్టేషన్ కు తరలించి విచారణ జరుపుతున్నారు. గతంలోనూ తన భర్త హరిదాస్ వైఖరిపై విజయ పాల్వంచ పోలీస్ స్టేషన్లో ఫిర్యాధు చేసినట్లు పోలీసులు తెలిపారు

Also read

Related posts

Share via