గంజాయి అనగానే పొడి, తడి గంజాయి అని పొట్లాలు, ప్యాకెట్లు, చాక్లెట్ల రూపంలో స్మగ్లింగ్ చేస్తారనే మనం విన్నాం. కానీ నిర్మల్ జిల్లాకు చెందిన కొంతమంది యువకులు తెలివి మీరారు. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి ఇంజెక్షన్లను తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు.
Marijuana Smuggling:
ఇప్పుడు దేశవ్యాప్తంగా కలవరం సృష్టిస్తోంది డ్రగ్స్ మహమ్మారి. ముఖ్యంగా తెలుగు రాష్ర్టాల్లో గంజాయి వినియోగం విపరీతంగా పెరిగింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గంజాయి అందరికీ ఒక వ్యసనం అయింది. గంజాయి సేవించిన యువకులు ఆ మత్తులో అత్యాచారాలు, హత్యలకు తెగపడుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తున్నప్పటికీ గంజాయి స్మగ్లర్లు తెలివి మీరుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో గంజాయి ఇంజెక్షన్లు తయారు చేస్తున్న ముఠా పట్టుబడిన ఘటన కలకలం రేపింది.
గంజాయి అనగానే పొడి, తడి గంజాయి అని పొట్లాలు, ప్యాకెట్లు, చాక్లెట్ల రూపంలో స్మగ్లింగ్ చేస్తారనే మనం విన్నాం. కానీ నిర్మల్ జిల్లాకు చెందిన కొంతమంది యువకులు తెలివిమీరారు. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి ఇంజెక్షన్లను తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఇంజెక్షన్ల రూపంలో గంజాయి అమ్ముతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ముఠా గంజాయిని లిక్విడ్ రూపంలోకి మార్చి ఇంజెక్షన్లుగా అమ్ముతున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి వంద గ్రాముల గంజాయి, మూడు మత్తు మందు ఇంజక్షన్లు, మూడు సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు .అలాగే వారు వినియోగిస్తున్న ఒక అటో, నాలుగు మొబైల్ పోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్మాల్ జిల్లాలో ఇంజక్షన్ల రూపంలో గంజాయి అమ్మకాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీని వెనుక ఉన్న ముఠాను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025