రోజు రోజుకీ మానవ సంబంధాలు బీటవారుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే చంపేస్తున్నారు. లేదా తమని తాము చంపుకుంటున్నారు. ఇటీవల ఓ భార్య తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన ఘటన మరువక ముందే.. తాజాగా ఓ భర్త కుటుంబ కలహాలతో భార్య, పిల్లలకు విషయం ఇచ్చి హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన కర్ణాటక లోని మాండ్య జిల్లానే జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని నాగమంగళ పట్టణంలో కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలకు విషపు నీరు ఇచ్చి హత్య చేశాడు. అవును…భార్యపై కోపంతో.. లోకం తెలియని పిల్లలకు నీళ్లలో విషమిచ్చి చంపిన అమానవీయ చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా నరసింహ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న తాగే నీటిలో విషం కలిపాడు. తర్వాత భార్య, ఇద్దరు పిల్లలకు ఆ నీటిని తాగించాడు. దీంతో అతని భార్య కీర్తన (23), పిల్లలు జయసింహ (4), రిషిక (1) మృతి చెందారు.
నరసింహ, కీర్తనలకు ఐదేళ్ల క్రితం వివాహం కాగా ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. నరసింహ, కీర్తనలు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. అయితే కటింగ్ షాప్ పెట్టుకున్న నరసింహకు ఓ అమ్మాయి పరిచయం అయి.. అక్రమ సంబంధం ఏర్పడిందని భార్య ఆరోపించింది. ఇదే విషయమై ఇంట్లో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో నరసింహులు భార్య, పిల్లల అడ్డు తొలగించుకోవాలని చూశాడు. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలకు, భార్యకు ఆ నీటిని ఇచ్చి తాగించాడు. అనంతరం భయంతో అతను కూడా అదే నీటిని తాగాడు.
నీరు తాగిన కొద్ది క్షణాల్లోనే భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు సహా నలుగురు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను చూసిన ఇరుగుపొరుగు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఆసుపత్రికి వెళ్లగా అతని భార్య కీర్తన కూడా మరణించింది, ప్రస్తుతం నరసింహ నాగమంగళ తాలూకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Also read
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే