SGSTV NEWS
CrimeTelangana

Mancherial Lovers : పెళ్లి చేసుకుంటానని మోసం.. ప్రియుడి ఇంటిముందు ధర్నా



మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఓ ప్రేమికురాలు తను ప్రేమించిన యువకుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనను నమ్మించి వాడుకున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటిముందు మౌన పోరాటం చేయడం సంచలనం సృష్టించింది. ఆమె కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగిందా యువతి.

Mancherial Lovers :  మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఓ ప్రేమికురాలు తను ప్రేమించిన యువకుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనను నమ్మించి వాడుకున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటిముందు మౌన పోరాటం చేయడం సంచలనం సృష్టించింది.


బాధితురాలి కథనం ప్రకారం..2015 నుంచి  చెన్నూరుకు చెందిన మధుతో ప్రేమలో ఉన్నానని, ఆయనే మొదట తనకు ప్రపోజ్‌ చేశాడని యువతి తెలిపింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడమే కాకుండా వారి ఇంట్లో వాళ్లకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడంది. అయితే మా పెళ్లికి ఆయన కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంలేదని, తమ కులం అమ్మాయినే చేసుకోమంటున్నారని చెప్పాడు. అన్నట్టుగానే 2022లో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత అతనికి దూరం ఉన్నానని యువతి తెలిపింది.

కానీ, మధు తిరిగి తనకు మెసేజ్‌లు, కాల్స్ చేస్తూ తనకు ఆమె అంటే ఇష్టం లేదని, తన వెంటపడి తిరిగి 2022లో నన్ను మరోసారి పెళ్లి చేసుకున్నాడని వాపోయింది. ఆ తర్వాత తనభార్యకు విడాకులిస్తా, నన్ను తీసుకెళ్తా అంటూ మభ్యపెడుతూ వస్తున్నాడు. గత వారం నన్ను ఇంటికి రమ్మని పోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాడు. ఇప్పుడు మొఖం చాటేస్తు్న్నాడని వాపోయిన సదరు యువతి తను గర్భం దాలిస్తే టాబ్లెట్లు పంపించి అబార్షన్‌ చేయించాడని ఆరోపించింది. ఇప్పుడు తనను ఎవరు చేసుకుంటారని ప్రశ్నిస్తున్న సదరు యువతి తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తుంది. ఈ మేరకు తన కుటుంబ సభ్యులతో కలిసి మధు ఇంటికి వచ్చిన యువతి మధు ఇంట్లో ఆందోళనకు దిగింది.

Also read

Related posts

Share this