July 3, 2024
SGSTV NEWS
CrimeNational

Fake Voter ID Cards: ఘరానా మోసం.. చదివింది టెన్త్ క్లాస్! నకిలీ ఓటరు, ఆధార్‌ కార్డుల తయారీలో జాదు..


భోపాల్‌, ఏప్రిల్‌ 18: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు ముమ్మర సన్నాహాలు సాగుతున్నాయి. నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల హామీలతో ఇంటింటి ప్రచారం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సందట్లో సడేమియా మాదిని సైబర్ నేరగాళ్లు చేతివాటం చూపిస్తున్నారు. భారీగా నకిలీ ఓటర్ ఐడీ కార్డులు, ఆధార్ కార్డులను తయారు చేసి అమాయకులను మోసం చేస్తున్నారు. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లో బుధవారం వెలుగు చూసింది. ఆ రాష్ట్ర సైబర్ క్రైమ్ బృందం తెలిపిన వివరాల ప్రకారం..

ఏప్రిల్ 19 నుంచి దేశంలో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు తయారు చేస్తున్న వారిపై ఎన్నికల సంఘం నిఘా ఉంచింది. ఈ క్రమంలో, భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. అందులో అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రంగంలోకి దిగిన రాష్ట్ర సైబర్ క్రైమ్ హెడ్‌క్వార్టర్స్ నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను తయారు చేస్తున్న ఓ వ్యక్తిని బీహార్‌లోని తూర్పు చంపారన్‌లో అరెస్టు చేశారు. నిందితుడు నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్‌కార్డుల తయారీ కోసం వెబ్‌సైట్‌ను నడుపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడు పదో తరగతి మాత్రమే పాస్ అయ్యాడు. యూట్యూబ్‌లో నకిలీ ఓటర్ ఐడీ కార్డులను తయారు చేసే డియోను చూసి వాటిని ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. తన స్నేహితుడి ఖాతాలోని బార్‌కోడ్ స్కానర్‌లో డబ్బు తీసుకుని, ఎవరి పేరు మీద కావాలంటే వారిపై వారి ఫోటో పెట్టి నిమిషాల్లో ఐడీ కార్డు తయారు చేసేవాడు.

అలా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన చాలా మంది మోసపోయారు. ఈ నిందితుడు దేశవ్యాప్తంగా దాదాపు 25 వేల నకిలీ ఐడీలు, ఆధార్ కార్డులను తయారు చేశాడు. నిందితులు ఒక్కొక్కరి నుంచి రూ.20 మాత్రమే తీసుకుని ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు తయారు చేశాడని సైబర్ ఏడీజీపీ యోగేష్ దేశ్‌ముఖ్ తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలు నాలుగో దశలో జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు నకిలీ ఓటర్ ఐడి కార్డులను తయారు చేస్తు్న్న నిందితుడిని మధ్యప్రదేశ్ సైబర్ పోలీసులు చాకచర్యంగా పట్టుకోవడంతో అధికారుల ప్రశంసలు కురిపించారు.

Also read

Related posts

Share via