పాల ప్యాకెట్ కోసం కుమారుడితో వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై చోటుచేసుకుంది.

అబ్దుల్లాపూర్మెట్: పాల ప్యాకెట్ కోసం కుమారుడితో
వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై చోటుచేసుకుంది. మృతుడిని ఏపీలోని కొవ్వూరు ప్రాంతానికి చెందిన శెట్టి కనక ప్రసాద్ (35)గా గుర్తించారు. జీవనోపాధి కోసం పది రోజుల క్రితమే ఆయన కుటుంబం ఈ ప్రాంతానికి వచ్చింది. గురువారం ఉదయం కనక ప్రసాద్ తన రెండేళ్ల కుమారుడితో కలిసి పాల ప్యాకెట్ తీసుకొచ్చేందుకు వెళ్లారు. ఈ క్రమంలో హైవేపై అతడి బైకు విజయవాడ వైపు నుంచి వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఘటనాస్థలంలోనే ప్రసాద్ మృతిచెందారు. బాలుడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025