ఉపముఖ్యమంత్రి పేషీకి ఫోన్లు చేసి పవన్ కల్యాణ్ను చంపేస్తానని బెదిరించిన వ్యవహారంలో నెల్లూరుకు చెందిన మల్లికార్జునరావును విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పవన్ పేషీకి కాల్స్ చేసి చంపేస్తానని బెదిరింపు తాగుడుకు బానిసై మానసికంగా కుంగిపోయినట్లు గుర్తించిన పోలీసులు
అమరావతి: ఉపముఖ్యమంత్రి పేషీకి ఫోన్లు చేసి పవన్ కల్యాణ్ను చంపేస్తానని బెదిరించిన వ్యవహారంలో నెల్లూరుకు చెందిన మల్లికార్జునరావును విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య విడిపోయి.. ఆర్థిక పరిస్థితులు సరిగా లేక.. తాగుడు కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో మానసికంగా కుంగుబాటుకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. నిర్వేదంలో ప్రముఖులకు ఫోన్లు చేసి బెదిరింపు ఫోన్లు చేస్తుంటాడని గుర్తించారు.
ర్యాపిడో బుక్ చేసుకుని దొరికిపోయాడు
డిప్యూటీ సీఎం పేషీకి ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం పలు దఫాలు మల్లికార్జునరావు ఫోన్లు చేసి చంపేస్తానని బెదిరించాడు. పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. నంబరు ఆధారంగా చిరునామా తిరువూరుగా గుర్తించారు. మల్లికార్జునరావు కాల్ డేటాను పరిశీలించగా.. చివరి నంబరును పట్టుకుని పోలీసులు ఆరాతీశారు. అది ర్యాపిడో బైక్ రైడర్ గా గుర్తించారు. అతడిని విచారించగా.. తాను ఎంజీ రోడ్డులోని ఓ హోటల్ వద్ద దింపినట్లు చెప్పాడు. హోటల్లో తనిఖీ చేయగా
దొరికాడు.
వారం నుంచి హోటల్లోనే మకాం
నిందితుడు పోలీసులకు దొరికిన హోటల్లో నే ఈ నెల 4న దిగినట్లు అక్కడి రికార్డుల ద్వారా గుర్తించారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నాడు. నాలుగు రోజులకు గది అద్దె చెల్లించాడు. అప్పటి నుంచి అద్దె కట్టలేదు. గదిలో దాదాపు 20 ఖాళీ మద్యం సీసాలు ఉన్నాయి. నెల్లూరుకు చెందిన మల్లికార్జునరావు తల్లిదండ్రులు చనిపోయారు. పెళ్లయిన ఏడాదికే భార్య వదిలేయడం, ఉద్యోగం లేకపోవడం, రియల్ ఎస్టేట్ కలిసి రాకపోవడంతో తాగుడుకు బానిసగా మారిపోయాడు. అక్కలు, సోదరుడు ఇచ్చే డబ్బులతో జల్సాలు చేసేవాడు. తిరువూరులోని సోదరి చిరునామాతోనే ఆధార్, పాన్, సిమ్ కార్డులు తీసుకున్నాడు.
ప్రముఖులకు ఫోన్లు చేయడం అలవాటు
మల్లికార్జునరావుపై విశాఖపట్నంలో ఓ మహిళపై దాడి చేసిన కేసు నమోదైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నా.. మంగళవారం ఉదయం వరకు మద్యం మత్తులోనే ఉన్నాడు. తరచు ప్రముఖుల నంబర్లు సంపాదించి వీలైతే వారిని కలిసేందుకు ప్రయత్నిస్తాడు. లేనిపక్షంలో వారికి ఫోన్లు చేయడం, లేదా ఎస్ఎంఎస్లు పంపడం చేస్తుంటాడని గుర్తించారు. పవన్కల్యాణ్ పేషీతో పాటు గతంలో డీజీపీకి, హోంమంత్రి అనిత తదితరులకు కూడా ఫోన్లు చేసినట్లు తేల్చారు. నిందితుడి కాలేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు.
Also read
- లక్కీ భాస్కర్ అవుతాం.. గోడ దూకి పారిపోయిన నలుగురు విద్యార్థులు..
- పోలీసుల అదుపులో మల్లికార్జునరావు
- Margasira Purnima: లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం కావాలంటే.. మార్గశిర పౌర్ణమి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా
- Margashira Purnima: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మార్గశిర పౌర్ణమి రోజున ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయాలంటే..
- Annapurna Jayanti 2024: అన్నపూర్ణ జయంతి రోజున ఈ వస్తువులు దానం చేయండి..