SGSTV NEWS
CrimeTelangana

Mahaa News: మమ్మల్ని చంపేస్తారా.. దాడిపై తీవ్రంగా స్పందించిన ఎండీ వంశీ!


హైదరాబాద్‌లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్‌ఎస్ దాడి చేయడంతో ఎండీ వంశీ తీవ్రంగా స్పందించారు. పెద్ద బండరాయలతో కార్లు మీద దాడి చేశారని తీవ్రంగా మండిపడ్డారు. మమ్మల్ని చంపేస్తారా? అంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలపై ఎండీ వంశీ మండి పడ్డారు.

హైదరాబాద్‌లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్‌ఎస్ దాడి చేయడంతో ఎండీ వంశీ తీవ్రంగా స్పందించారు. ఫ్యాన్ ట్యాపింగ్ విషయాలను బయట పెట్టే ప్రయత్నం చేసినందుకు పెద్ద ఇనుప రాడ్డులు, కర్రలతో దాడి చేస్తారా? పెద్ద బండరాయలతో కార్లు మీద దాడి చేశారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యం ఏమైవుతుంది? మీడియా స్వేచ్ఛ ఏమవుతుంది? మమ్మల్ని చంపేస్తారా? అంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలపై ఎండీ వంశీ మండిపడ్డారు.



ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్‌ పేరును ప్రస్తావిస్తూ కథనాలు ప్రసారం చేసినందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు  మహా న్యూస్‌పై దాడులకు పాల్పడ్డారు. మహా ఛానెల్ ఆఫీసులోకి చొరబడి అద్దాలు పగలగొట్టారు, కార్లు ధ్వంసం చేశారు. రామన్న పైనే కామెంట్స్ చేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also read

Related posts

Share this