December 3, 2024
SGSTV NEWS
CrimeNational

ప్రేమ వివాహం.. కానీ భర్త చేసిన పనికి తట్టుకోలేక… దారుణంగా

ఆమె భర్తే ప్రాణంగా బతికింది. పైగా ప్రేమ వివాహం కావడంతో.. అతడిపైనే పంచ ప్రాణాలు పెట్టుకుంది. తాను అంతలా ప్రేమిస్తే.. ఆమె భర్త మాత్రం.. అత్యంత నీచానికి దిగ జారాడు. ఆ దారుణాన్ని తట్టుకోలేక ఆమె భయంకర నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

Also read :తాగొచ్చిన తండ్రి.. కూతురు అలా అనే సరికి…

వారిది ప్రేమ వివాహం. ఆరేళ్ల క్రితం వారిద్దరూ లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఆమెకు భర్తే లోకం.. నిత్యం అతడి గురించే ఆలోచనలు. భర్తపై అంతులేని ప్రేమ. కట్టుకున్న వాడి కోసం కన్న వారిని సైతం పక్కకు పెట్టింది. మరి అంతలా ప్రేమించిన భార్య ఉన్నా సరే.. ఆ వ్యక్తి నీచానికి ఒడిగట్టాడు. దీనిపై భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. అయినా అతడిలో మార్పు రాలేదు. ఇక భర్త చేసిన పనికి తట్టుకోలేని మహిళ దారుణ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

Also read :ఇస్రో ఉద్యోగిగా పరిచయం.. అందంతో వలపు వల.. నమ్మించి లక్షల్లో ముంచి

పచ్చని సంసారంలో అక్రమ సంబంధం అగ్గిరాజేసింది. కుటుంబాన్ని ముక్కలు చేసింది. భర్త చేసిన మోసాన్ని భరించలేక.. వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చనిపోయిన మహిళను మానస (25)గా గుర్తించారు. ఆమె ఆరేళ్ల క్రితం దిలీప్‌ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరు బెంగళూరులోని బ్యాదరహళ్లిలో నివాసం ఉంటున్నారు. ఇక ఈ దంపతుల అన్యోన్యతకు గురుతుగా ఐదేళ్ల కుమార్తె ఉంది. ప్రేమించిన భర్త, పండంటి బిడ్డ.. వారి జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. మరి వారి ఆనందాన్ని చూసి విధికి కన్ను కుట్టిందేమో.. మరో మహిళ రూపంలో వారి పచ్చని సంసారంలో అగ్గిరాజేసింది.

Also read :వేసిన తాళం వేసినట్టే ఉంది.. కానీ బీరువాలో దాచిన డబ్బంతా హాంఫట్.. చెక్ చేయగా
ప్రాణంగా ప్రేమించే భార్య ఉన్నప్పటికి.. దిలీప్‌.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అది కాస్త అతడి భార్య మానసకు తెలిసింది. ఈ విషయంలో నిత్యం భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దిలీప్‌ తీరుతో విసిగిపోయిన మానస.. కనీసం బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా.. ఆత్మహత్య చేసుకుని మరణించింది. బెంగళూరులోని బ్యాదరహళ్లిలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మానస ప్రాణాలు తీసుకుంది. అయితే ఆత్మహత్యకు ముందు మొబైల్‌లో వీడియో ఆన్ చేసి.. తన ఆవేదన చెప్పుకొచ్చింది. భర్త అక్రమ సంబంధం కారణంగా ప్రాణాలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న కూడా.. ఒక్క నిమిషం ఆగి మొబైల్ ఆఫ్ చేసి తనువు చాలించింది.

Also read :కన్నతండ్రి కాలయముడయ్యాడు.. సెల్ ఫోన్ చార్జర్ వైర్‌తో గొంతు బిగించి హత్య!విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేపి.. దర్యాప్తు చేస్తున్నారు. భర్త అక్రమ సంబంధంతోనే మానస ప్రాణాలు తీసుకుందని పోలీసులు వెల్లడించారు విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయని.. దీంతో మానస ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. మృతురాలిని ఆస్పత్రికి తీసికెళ్లేలోపే ప్రాణాలు వదిలిందని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు

Also read :కన్నతండ్రి కాలయముడయ్యాడు.. సెల్ ఫోన్ చార్జర్ వైర్‌తో గొంతు బిగించి హత్య!

Related posts

Share via