కేరళలో దారుణం జరిగింది. పెళ్లికి ముందు ఇస్లాం మతంలోకి మారాలంటూ ప్రియుడు, అతని కుటుంబం ఒత్తిడి చేయడంతో ఓ 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. టీచర్ ట్రైనింగ్ కోర్సు (TTC) విద్యార్థిని అయిన సోనా ఎల్దోస్, తన ప్రియుడు రమీస్ తో ప్రేమలో ఉంది.
కేరళ(Kerala) లో దారుణం జరిగింది. పెళ్లికి ముందు ఇస్లాం మతంలోకి మారాలంటూ ప్రియుడు, అతని కుటుంబం ఒత్తిడి చేయడంతో ఓ 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టీచర్ ట్రైనింగ్ కోర్సు (TTC) విద్యార్థిని అయిన సోనా ఎల్దోస్, తన ప్రియుడు రమీస్ తో ప్రేమలో ఉంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన రమీస్.. అతని ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ అతని కుటుంబం పెళ్లికి ముందే ఇస్లాం మతంలోకి మారాలని ఆమెను పట్టుబట్టింది. లేకపోతే పెళ్లి ఒప్పుకోమని చెప్పి్ంది. దీనికి తోడు ప్రియుడు లైంగికంగా, మానసికంగా వేధించడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. చివరగా ఆమె తన తన సూసైడ్ నోట్ లో ఈ విషయాలను వెల్లడించింది.
ఈ ఘటనపై యువతి తల్లి మాట్లాడుతూ.. తన కుమార్తె సోనా కొంతకాలంగా రమీస్‌ను ప్రేమిస్తోందని, అతని కుటుంబం తన కూతుర్ని మతం మార్చుకోవాలని బలవంతం చేస్తున్నారని చెప్పింది. అయితే తన కూతురు అతనితో పెళ్లి కోసం మతం మార్చుకోవడానికి కూడా సిద్దపడిందని కానీ ఇటీవల తన తండ్రి చనిపోవడంతో వెనక్కి తగ్గిందని చెప్పింది. దీంతో ప్రియుడు అతని కుటుంబం తన కూతుర్ని వేధించడం, మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడంతో తన కూతురు సోనా తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించిందని వాపోయింది.
శారీరకంగా, మానసికంగా వేధించాడని
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె డెత్ నోట్‌లో రమీస్ తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని, గదిలో బంధించాడని, పెళ్లికి ముందు మతం మారమని బలవంతం చేశాడని యువతి అందులో ఆరోపించింది. రమీస్ ఆమెపై దాడి చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. రమీస్ గతంలో అనైతిక అక్రమ రవాణా కేసులో అరెస్టు అయినట్లుగా పోలీసులు తెలిపారు. రమీస్‌పై గతంలో ఏడు మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులు కూడా నమోదయ్యాయని వెల్లడించారు. ప్రియుడు రామిస్‌ను పోలీసులు అరెస్టు చేశారు ఎర్నాకుళం జిల్లా పోలీసు చీఫ్ ఎం. హేమలత నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
ఇది లవ్ జిహాదీ ఉగ్రవాదం
విద్యార్థి ఆత్మహత్య తర్వాత ఇది లవ్ జిహాదీ(Love Jihad) ఉగ్రవాదం అని రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కేరళలో జిహాదీ ఉగ్రవాదం పెరుగుతుందోని, ఈ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన మతపరమైన ఉగ్రవాదం అని కూడా పేర్కొంది. ఈ సంఘటనలన్నింటిపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025