April 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

కేపీహెచ్బీకాలనీ: ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓయువకుడు సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్ధిపేట జిల్లా, ప్రశాంత్నగర్కు చెందిన ఉప్పరపల్లి మహేందర్ (25) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అడ్డగుట్ట సొసైటీలోని హాస్టల్లో ఉంటున్నాడు.

సోమవారం సాయంత్రం హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో హాస్టల్ నిర్వాహకుడు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు కేపీహెచ్ బీ పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమలో ఓడిపోవడమే తన మరణానికి కారణమని రాసి ఉన్న లెటర్ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు పై పడిన సెల్ఫోన్ తీసుకుంటుండగా..

శామీర్పేట్: రోడ్డు పడిన సెల్ ఫోన్ తీసుకుంటుండగా కారు ఢీ కొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం రాత్రి జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట్ జిల్లా, మామిడ్యాల గ్రామానికి చెందిన పొట్ట ప్రవీణ్ (23), హైదరాబాద్లో డెలివరీ బాయ్ పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని బైక్పై రాజీవ్ రహదారి మీదుగా వెళుతుండగా తుర్కపల్లి గ్రామ సమీపంలో తన జేబులోంచి సెల్ఫోన్ రోడ్డుపై పడింది. దీంతో కిందపడిన సెల్ఫోన్ ను తీసుకుంటుండగా అదే సమయంలో నగరం నుంచి వేగంగా వచ్చిన ఎర్టిగా కారు వెనక నుంచి అతడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. జినోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via