July 1, 2024
SGSTV NEWS
Spiritual

Lord Krishna : రాధాకృష్ణుడిని ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

స్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనం గా రాధాకృష్ణుల అనుబంధాన్ని చెప్పుకుంటారు. బృందావనంలో ఎంతోమంది గోపికలు ఉన్నా రాధాకు కృష్ణుడి హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది.మరి ఇంతగా ప్రేమించిన రాధా ను శ్రీకృష్ణుడు ఎందుకు వివాహం చేసుకోలేదు.
రాధా జన్మ రహస్యం ఏమిటి.చివరికి రాధ ఏమైంది తదితర ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాధా సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. శ్రీకృష్ణుడిగా మహావిష్ణువు భూమి మీద అవతరించే ముందు లక్ష్మితో నీవు ముందుగా భూలోకంలో జన్మించమని కోరతాడు. దీనికి లక్ష్మి తోలుత నిరాకరించిన చివరకు తన ప్రియ సకుని అభ్యర్థన మన్నించి ఓ షరతు విధిస్తుంది.నీవు నా ముందుకు వచ్చేవరకు కళ్ళు తెరవను అని చెప్తుంది.ఈ షరతులకు మహావిష్ణువు ఒప్పుకోవడంతో లక్ష్మీదేవి పద్మంలో పసిపాపగా యమునా నది తీరంలో ఉద్భవిస్తుంది. యమునా నది ఒడ్డున గోవులను కాస్తున్న వృషభానుడు అనే యాదవుడికి పద్మంలో పసిపాప కనిపించడంతో ఆ పాపను ఇంటికి తీసుకువెళ్లి రాధా అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు.
అయితే పాప పెరిగి పెద్దవుతున్న కళ్ళు మాత్రం తెరవకపోవడంతో కలత చెందిన వృషభానుడు అటుగా వచ్చిన నారద మహర్షితో తన పాప గురించి చెబుతాడు. రాధ జన్మ రహస్యం ముందే తెలుసుకున్న నారద మహర్షి వృషభనుడితో గోకులంలో ఉన్న యశోద నందులతో పాటు అప్పుడే జన్మించిన కృష్ణుడిని ఇంటికి ఆహ్వానించమని చెబుతాడు.వృషభనుడు నందుని తన కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించడంతో కుటుంబ సమేతంగా అతని ఇంటికి వస్తారు. బుడిబుడి అడుగులతో బుల్లి కన్నయ్య రాధా ను సమీపిస్తుండగా తన స్వామి వస్తున్నాడని గ్రహించిన రాధా కన్నయ్య దగ్గరకు రాగానే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. అప్పటినుండి వారి ఇరువురు ఎలాంటి అరా మరికలు లేకుండా సాన్నిహిత్యంగా మెలుగుతుంటారు. రాధ, కృష్ణుడు తనకంటే వయసులో కొంచెం చిన్నవాడైనా తన ప్రేమకు వయసుతో అడ్డురాదంటూ కన్నయ్య పై ప్రేమను కురిపిస్తుంది. కృష్ణుడు యుక్త వయసు రాగానే కంసుని సంహరించడానికి మధురకు వెళ్లే ముందు రాధా దగ్గరకు వచ్చి తన కర్తవ్యాన్ని వివరిస్తాడు. రాధా బాధపడుతూనే కృష్ణుని మధురకు సాధనంపుతుంది. అలా రాధా,కృష్ణుడుకు ఏడబాటుకు గురవుతుంది. రాధ ఎక్కడ ఉన్నా తన మనసు మాత్రం కన్నయ్య చుట్టూనే తిరుగు తుంది.

కృష్ణుడు కూడా తను వేరు రాధా వేరు అని ఎప్పుడూ భావించలేదు.ఒకసారి రాధా కిట్టయ్యను మనం పెళ్లి చేసుకుందామని అడుగుతుంది. రాధా మాటలకు చిరునవ్వు నవ్విన కృష్ణుడు మన శరీరాలు వేరైనా ఆత్మలు ఒక్కటే,పెళ్లి అనేది దేహానికి కానీ ఆత్మకు కాదని చెబుతాడు. శ్రీకృష్ణుడికి రాధఅత్త అవుతుంది అని మరో కథనం ఉంది.కృష్ణుడు దూరం అవ్వడంతో ఎప్పుడూ కన్నయ్య అనే ధ్యానిస్తూ రాధా ధ్యానంలో మునిగిపోతున్న రాధా ను చూసి భయపడిన ఆమె తల్లిదండ్రులు రాధకు ఇష్టం లేకపోయినా చంద్రసేనుడు అనే యాదవునీతో వివాహం చేస్తారు.చంద్రసేనుడు కృష్ణుడికి మేనమామ అవుతాడు.అలా రాధా,కృష్ణుడికి మేనత్త అవుతుంది. ఎప్పటికప్పుడు రాధా యోగక్షేమాలు తెలుసుకుంటున్న శ్రీకృష్ణుడు రాధా ను వృద్ధాప్యంలో ఒకసారి ఆమెను కలుసుకుంటాడు. మరోవైపు రాధా,రుక్మిణిలో ఇద్దరు ఒక్కటే స్వరూపమని ప్రచారంలో ఉంది…

Also read

Related posts

Share via